Coordinates: 32°30′30″N 71°56′12″E / 32.508402°N 71.936538°E / 32.508402; 71.936538

అంబ్ ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబ్ ఆలయం
امب مندر
ఉప్పు శ్రేణి పర్వత ప్రాంతాలలోని ఆలయం
అంబ్ ఆలయం is located in Pakistan
అంబ్ ఆలయం
Shown within Pakistan
అంబ్ ఆలయం is located in South Asia
అంబ్ ఆలయం
అంబ్ ఆలయం (South Asia)
స్థానంకుశంబు జిల్లా
పంజాబ్
పాకిస్థాన్ పాకిస్తాన్
నిర్దేశాంకాలు32°30′30″N 71°56′12″E / 32.508402°N 71.936538°E / 32.508402; 71.936538
చరిత్ర
స్థాపన తేదీ7-9శతాబ్దాల మధ్యకాలం
సంస్కృతులుపంజాబ్ హిందూ

అంబ్ ఆలయం (ఉర్దూ: امب مندر)ను స్థానికంగా అంబ్ షరీఫ్ (ఉర్దూ: امب شریف; "నోబుల్ అంబ్") అని పిలుస్తారు, ఇది పాకిస్తాన్ పశ్చిమ భాగాన ఉన్న సకేసర్ పర్వతంపై గల పురాతన హిందూ దేవాలయ సముదాయంలో భాగం. ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉంది. ఈ ఆలయ సముదాయం 7 నుండి 9 శతాబ్దాల మధ్య కాలంలో హిందూ షాహీ సామ్రాజ్యం పాలనలో నిర్మించబడింది.[1]

నిర్మాణం[మార్చు]

ఇది పాకిస్తాన్లోని హిందువులకు సంబంధించిన దేవాలయాలలో ఉత్కృష్టమైనదిగా పరిగణించబడుతుంది. ప్రధాన ఆలయం దాదాపు 15 నుండి 20 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయం చతురస్రాకార వేదికపై ఇటుకతో నిర్మించబడింది. ఆలయం వెలుపలి భాగం కాశ్మీరీ శైలి మూలాంశాలతో అలంకరించబడింది. అయితే ప్రధాన ఆలయ నిర్మాణం కాశ్మీరీ దేవాలయాలకు భిన్నంగా ఉంటుంది. శ్చిమాన 75 మీటర్ల దూరంలో రాతి నిర్మించబడిన మరొక చిన్న ఆలయం ఉంది. ఆలయం 7 నుండి 8 మీటర్ల ఎత్తులో ఉంది, ఆలయ సముదాయం మొత్తం కోటతో చుట్టబడి ఉంది. ఈ ఆలయంలో ప్రధాన ఆలయం వైపు చిన్న హాలు కూడా ఉంది, అదే పరిమాణంలో ఉన్న మరొక ఆలయానికి ఇది కొన్ని మీటర్ల దూరంలో ఉంది, అది ఇప్పుడు ఉనికిలో లేదు.[2][3]

చరిత్ర[మార్చు]

దీనిని 19వ శతాబ్దం చివరలో అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ సందర్శించారు. 1922-24లో దయా రామ్ సాహ్ని పర్యవేక్షణ చేశాడు. ఈ దేవాలయం శతాబ్దాల తరబడి విదేశీ మూకలచే దోచుకోబడింది, 19వ శతాబ్దం చివరలో మిగిలి ఉన్న చివరి విగ్రహాన్ని లాహోర్ మ్యూజియమ్‌కు తరలించారు.[4]

ఆలయం వెలుపలి భాగం కాశ్మీరీ శైలి ఆభరణాలతో అలంకరించబడింది. ప్రధాన ఆలయ నిర్మాణం కాశ్మీర్ దేవాలయాల నిర్మాణం కంటే భిన్నంగా ఉంటుంది. అవి సాధారణ అలంకారాలను కలిగి ఉంటాయి. ప్రధాన ఆలయం సమీపంలోని కలార్ దేవాలయం, ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లోని కాఫిర్ కోట్ ఆలయాన్ని పోలి ఉంటుంది.

19వ శతాబ్దం చివరలో దివంగత పురావస్తు శాస్త్రవేత్త అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ ఈ స్థలాన్ని సందర్శించాడు. 1922-24లో దయారామ్ సాహ్నిచే కొంతవరకు రక్షించబడింది. శతాబ్దాలుగా ఈ ఆలయం దోచుకోబడింది. చివరిగా మిగిలి ఉన్న విగ్రహం 19వ శతాబ్దం చివరలో ఈ ప్రదేశం నుండి తొలగించబడి, లాహోర్ మ్యూజియంలో ఉంచబడింది. ఈ ప్రదేశం ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్కియాలజికల్ సర్వే (1975)చే రక్షించబడుతుంది.

పరిసరాలు[మార్చు]

ప్రధాన ఆలయం దాదాపు 15 నుండి 20 మీటర్ల పొడవు ఉంటుంది. చతురస్రాకారపు స్తంభంపై ఇటుక, మోర్టార్‌తో నిర్మించబడింది. ఇది హిందూ షాహీ సామ్రాజ్యం నిర్మించిన దేవాలయాలలో "ఎత్తైనది"గా పరిగణించబడుతుంది. ఆలయ శిధిలాలు మూడు అంతస్తులను కలిగి ఉన్నాయి, మెట్లతో కూడిన బావులు కూడా ఉన్నాయి.

ఈ ఆలయం వెలుపలి భాగం కాశ్మీరీ శైలితో అలంకరించబడింది, ఇందులో కస్పెడ్ గూడు కూడా ఉంది. ప్రధాన ఆలయ నిర్మాణం, కాశ్మీరీ దేవాలయాల నుండి భిన్నంగా ఉంటుంది, ఇవి సాధారణంగా శిఖరాలను కలిగి ఉంటాయి. ప్రధాన ఆలయం సమీపంలోని దేవాలయం, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కాఫిర్ కోట్ దేవాలయం వంటి శైలిలో ఉంటుంది.[3]

మూలాలు[మార్చు]

  1. Gazetteer of the Attock District, 1930, Part 1. Sang-e-Meel Publications. 1932. Retrieved 21 September 2017.
  2. Rashid, Salman (2001). The Salt Range and the Potohar Plateau. Sang-e-Meel Publications. ISBN 9789693512571. Retrieved 21 September 2017.
  3. 3.0 3.1 Meister, Michael (2005). "Fig Gardens of Amb-Sharif, Folklore and Archaeology". East and West. Istituto Italiano per l'Africa e l'Oriente. 55 (1/4): 201–216. JSTOR 29757645.
  4. Journal of the Royal Asiatic Society of Great Britain and Ireland. Cambridge University Press for the Royal Asiatic Society. 1903. Retrieved 21 September 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=అంబ్_ఆలయం&oldid=3413889" నుండి వెలికితీశారు