అక్యూట్ మైలాయడ్ లుకేమియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Classification and external resources
Auer rods.PNG
ఎముక మజ్జ నమూనాలోని అక్యూట్ మైలాయడ్ లుకేమియా కణాలు సూక్ష్మదర్శినిలొ ఇలా ఉంటుంది.భాణముల గుర్తు అయుర్ రాడ్లను చూపిస్తొంది.
ICD-9205.0
ICD-O:మూస:ICDO
OMIM602439
DiseasesDB203
MedlinePlus000542
eMedicinemed/34
MeSHD015470

అక్యూట్ మైలాయడ్ లుకేమియా అనే ఈ రకము కాన్సర్ ఎముక మజ్జలోని మయలోసైట్స్ అనే కణములో జన్యు మార్పు సంభవించి, అవి నియంత్రణ లేకుండా విభజిస్తూ ఉండటం వల్ల ఏర్పడుతుంది. ఇది చాలా తొందరగా వ్యాప్తి చెందడము వలన దీనిని అక్యూట్ అని పిలుస్తారు. ఇది పిల్లల కన్నా పెద్దలలోనే ఎక్కువగ ఏర్పడుతుంది.[1]. అక్యూట్ మైలాయడ్ లుకేమియా బారిన పడే పెద్దల సరాసరి వయస్సు 65 సంవత్సరములు.[2]

లక్షణములు[మార్చు]

అక్యూట్ మైలాయడ్ లుకేమియా కణాములు పళ్ళ చిగురుకు వ్యాపించియున్నది

పై చెప్పబడిన లక్షణాలు ఉన్న అందరికీ ఈ జబ్బు ఏర్పడదు, ఇతర వ్యాధులకు కూడా ఇటువంటి లక్షణాలుంటాయి.

కారణములు[మార్చు]

అక్యూట్ మైలాయడ్ లుకేమియా కచ్చితమైన కారణములంటూ లేవు కాకపోతే కొన్ని కారణాల వలన అది సంభవించే ముప్పు అధికమౌతుంది.

నిర్దారణ[మార్చు]

రక్త పరీక్ష చెయడము ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. కానీ అది ఏ రకానికి చెందినదో తెలుసుకోవడానికి మరిన్ని పరీక్షలు చెయ్యాలి. ఈ పరీక్షలకు నమూనాను ఎముక మజ్జ నుండి సేకరించాలి, దీనిని ఎముక మజ్జ జీవాణుపరీక్ష (Bone marrow biopsy) అని అంటారు.[5]

ఎముక మజ్జనుండి సూది పిచికారి సహాయంతో నమూనాను సేకరించు దృశ్యము

ఎముక మజ్జ నుండి సేకరించిన నమూనా సహాయంతో క్రింది పరీక్షలు నిర్వహిస్తారు.

వెన్నెముక నుండి కేంద్రనాడీమండల ద్రవ్యాన్ని (మస్తిష్కమేరుద్రవమ) సేకరిస్తున్న దృశ్యము
అక్యూట్ మైలాయడ్ లుకేమియా కణములు, వీటిలో కడ్డీల వంటివాటిని అవుర్ రాడ్స్ అని అంటారు. వీటి సహాయముతోనే అక్యూట్ మైలాయడ్ లుకేమియా కణాలను సాదారన కణముల నుండి విభజిస్తారు

రకములు[7][మార్చు]

రకము పేరు క్రోమోజోమ్లు
M0 మినిమలీ డిఫరెంషియేటడ్ అక్యూట్ మైలాయడ్ లుకేమియా
M1 అక్యూట్ మైలాయడ్ లుకేమియా, వితౌట్ డిఫరెంషియేటడ్
M2 అక్యూట్ మైలాయడ్ లుకేమియా, విత్ గ్రానిలోసైట్ మెచ్యురేషన్ t (8;21) (q22;q22), t (6;9)
M3 అక్యూట్ ప్రోమైలోసైటిచ్ లుకేమియా (APL) t (15;17)
M4 అక్యూట్ మైలో మొనోసైటిక్ లుకేమియా inv (16) (p13q22), del (16q)
M4eo మొనోసైటిక్ లుకేమియాతోపాటు ఎముక మజ్జ ఈశనోఫీలియా inv (16), t (16;16)
M5 అక్యూట్ మొనోబ్లాస్టిక్ లుకేమియా (M5a) or అక్యూట్ మొనోసైటిక్ లుకేమియా (M5b) del (11q), t (9;11), t (11;19)
M6 అక్యూట్ యెరిత్రాయడ్ లుకేమియాలు
M7 అక్యూట్ మొగాకార్యో బ్లాస్టిక్ లుకేమియా t (1;22)

చికిత్స[మార్చు]

చికిత్సగా సాధారణంగా కీమోథెరపీను ఇస్తారు. కొన్ని సందర్భాలలో కీమోథెరపీతో పాటు రేడియోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ, ఇమ్యునోథెరపీని ఇస్తారు. ఇవి పని చేయని పక్షములో ఎముక మజ్జ మార్పడి చికిత్సను చేయవలసి వస్తుంది. సాధారణంగా రక్త వ్యాధి నిపుణుడు లేదా కాన్సర్ వ్యాధి నిపుణుడు ఆధ్వర్యంలో చికిత్స చేయబడును. కీమోథెరపీ మందులు ఒక్కో రకానికి మారుతుంది.

రెమిషన్ ఇండక్షన్[మార్చు]

రెమిషన్ ఇండక్షన్ విభాగము 30రోజుల పాటు కొనసాగుతుంది. రోగి ఆసుపత్రిలోనే గడపవలసి వస్తుంది. ఈ విభాగము యొక్క లక్ష్యము లుకేమియాను కనిపించనంతగా తగ్గించడమే. మజ్జలోని "బ్లాస్టు" కణాలు 5% కన్నా తక్కువగా చేయడమే ఈ దశయొక్క లక్ష్యము.[8]

ఇంటెన్సిఫికేషన్[మార్చు]

రెమిషన్ ఇండక్షన్లో చాలా లుకేమియా కణాలు తగ్గినా, శరీరంలో మిగిలి ఉన్న కణాలు మరలా లుకేమియాగా మారుతాయి. ఈ దశలో రెమిషన్ ఇండక్షన్లో వాడిన మందులతో పాటు మరికొన్ని కొత్త మందులను వాడుతారు. మిగిలిన లుకేమియా కణాలును చంపడమే ఈ దశ యొక్క లక్ష్యము.[8]

దుష్ప్రభావము[మార్చు]

కీమోథెరపీమందులతో చాలా దుష్ప్రభావాలున్నాయి. కొన్ని ప్రాణంతకంగా కూడా వుండవచ్చును.కానీ చాలా వరకు దుష్ప్రభావలు చికిత్స ఆపిన వెంటనే నిలచిపోవును. తరచుగా కనిపించే దుష్ప్రభావాలు.[9]

 • జుత్తు రాలడము.[9]
 • వాంతులు.[9]
 • నిస్సత్తువ.[9]
 • రక్తకణాల సంఖ్య తగ్గుట.[9]
 • శరీరం బరువు కోల్పోవటము.[9]

కాన్సర్ తిరగబెట్టుట[మార్చు]

దాత వద్దనుండి సేకరింపబదడ్ద ఎముక మజ్జ. దీనిని రొగి శ్రరీరములోనికి నరముల ద్వరా పంపించబడును.

రకమును బట్టి 20-70 శాతము మందిలో మాత్రమే కీమోథెరపీ చికిత్సతోనే లుకేమియాను నయం చేయవచ్చును.[10], [11], [12] తక్కిన వారిలో లుకేమియా మరలా తిరగబెట్టును. వీరికి ఎముక మజ్జ మార్పిడి చికిత్స మాత్రమే శాశ్వత పరిస్కారం చూపగలదు. ఇందులో రోగి యొక్క ఎముక మజ్జను సమూలంగా నాశనం చేసి దాని స్థానంలో దాత వద్ద నుండి సేకరించిన మజ్జ ఇవ్వబడుతుంది. ఇది అత్యంత ఖర్చుతో కూడుకొన్న విషయము పైగా, సరైన దాత దొరకనిచో ఇది చెయడం సాధ్యము కాదు. కొన్ని సార్లు రోగి యొక్క సొంత కణాలనే సేకరించి మరలా అతనికే ఇవ్వబడుతుంది, కానీ ఇటువంటి చికిత్స యొక్క ఫలితాలు సంతృప్తికరంగా లేవు. కొన్ని సార్లు రోగికి జబ్బు నయమయ్యె అవకాశము లేనిచో బాధను తగ్గించడానికి మాత్రమే చికిత్స ఇవ్వవలసి వస్తుంది. దీనిని పాలిటివ్ కేర్ అని అంటారు.[13], [14]

ఆధారములు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 [1],webmd.
 2. [2],bethematch.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 [3],nlm.
 4. 4.0 4.1 [4],mayoclinic.
 5. 5.0 5.1 5.2 5.3 [5],umm.
 6. 6.0 6.1 6.2 6.3 [6],మయొ.
 7. http://en.wikipedia.org/wiki/Acute_myeloid_leukemia
 8. 8.0 8.1 [7].,
 9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 [8].,
 10. http://www.urmc.rochester.edu/encyclopedia/content.aspx?ContentTypeID=34&ContentID=BAMLD5
 11. http://www.cancerresearchuk.org/cancer-help/type/aml/treatment/statistics-and-outlook-for-acute-myeloid-leukaemia
 12. http://leukaemialymphomaresearch.org.uk/information/leukaemia/acute-promyelocytic-leukaemia-apl/prognosis
 13. http://www.uptodate.com/contents/treatment-of-relapsed-or-refractory-acute-myeloid-leukemia
 14. http://www.texasoncology.com/types-of-cancer/leukemia/acute-myeloid-leukemia/relapsed-acute-myeloid-leukemia