అగ్నిధార (అనువాద గ్రంథం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగ్నిధార
కృతికర్త: ఖుర్రతుల్ ఐన్ హైదర్
అసలు పేరు (తెలుగులో లేకపోతే): ఆగ్ కా దరియా
అనువాదకులు: వేమూరి రాధాకృష్ణమూర్తి
దేశం: భారత దేశం
భాష: తెలుగు
మూల గ్రంథం: ఉర్దూ
సీరీస్: అంతర భారతీయ గ్రంథమాల
ప్రక్రియ: నవల
ప్రచురణ: నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా
విడుదల:
పేజీలు: 367

అగ్నిధార (అనువాద గ్రంథం) జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, ఉర్దూ రచయిత్రి ఖుర్రతుల్ ఐన్ హైదర్ రచించిన నవలకు తెలుగు అనువాదం. వేమూరి రాధాకృష్ణమూర్తి తెలుగులోకి ఈ గ్రంథాన్ని అనువదించారు.

రచన నేపథ్యం[మార్చు]

ఆగ్ కా దరియా శీర్షికన ఖుర్రతుల్ ఐన్ హైదర్ రచించిన మూల గ్రంథం ఉర్దూ సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ఆ గ్రంథాన్ని వేమూరి రాధాకృష్ణమూర్తి తెలుగులోకి అనువదించగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా అంతర భారతీయ పుస్తకమాల శీర్షికన అనువదించింది.[1]

ఇతివృత్తం[మార్చు]

ఖుర్రతుల్ ఐన్ హైదర్ చంద్రగుప్త మౌర్యుని కాలం మొదలుకొని 1947 భారతవిభజన వరకూ వేలయేళ్ల కాలాన్ని నేపథ్యంగా స్వీకరించి ఈ రచన చేశారు. కర్మఫలాన్ని గురించి చింతించకుండా, తన బాధలు, అనుభవాలు వెనక్కి చూడక మానవుడు ముందుకు సాగిపోవాలనే మహత్తర సత్యాన్ని విప్పిచెప్పే సుదీర్ఘ ఉర్దూ నవలగా ఈ నవల గురించి నే.బు.ట్ర. గ్రంథసూచీలో పేర్కొన్నారు.

రచయిత(త్రి) గురించి[మార్చు]

మూలరచయిత ఖుర్రతుల్ ఐన్ హైదర్ ప్రముఖ ఉర్దూ రచయిత్రి. ఆమె ఉర్దూ సాహిత్యరంగంలో చేసిన విశేష కృషికి గాను ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం పొందారు. గ్రంథాన్ని అనువదించిన వేమూరి రాధాకృష్ణమూర్తి తెలుగు సాహిత్యంలో అనువాదకునిగా, రచయితగా పేరొందారు.

మూలాలు[మార్చు]

  1. పుస్తక సూచి 2013 తెలుగు ప్రచురణలు:నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా:పు.113