జ్ఞానపీఠ పురస్కారం
Jnanpith Award | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | సాహిత్యం (వ్యక్తిగత) | |
వ్యవస్థాపిత | 1964 | |
మొదటి బహూకరణ | 1965 | |
క్రితం బహూకరణ | 2018 | |
మొత్తం బహూకరణలు | 56 | |
బహూకరించేవారు | భారతీయ జ్ఞానపీఠ్ | |
నగదు బహుమతి | ₹11 lakh (equivalent to ₹14 lakh or US$18,000 in 2020) | |
వివరణ | భారతదేశం లో సాహితీ పురస్కారం | |
మొదటి గ్రహీత(లు) | G. Sankara Kurup |
భారతదేశపు సాహితీ పురస్కారాల్లో జ్ఞానపీఠ పురస్కారం అత్యున్నతమైంది. దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన భారతీయ జ్ఞానపీఠం వారు ప్రదానం చేస్తారు. వాగ్దేవి కాంస్య ప్రతిమ, పురస్కార పత్రం, పదకొండు లక్షల రూపాయల నగదు ఈ పురస్కారంలో భాగం.1964లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా 1965లో మలయాళ రచయిత జి శంకర కురుప్‌కు వచ్చింది. భారతీయ అధికార భాషలలో దేనిలోనైనా రాసే భారత పౌరులు ఈ బహుమతికి అర్హులు. ఐతే ఒక భాషాసాహిత్యానికి ఈ పురస్కారం లభించిన తర్వాత మూడేళ్ళపాటు ఆ భాషాసాహిత్యాన్ని ఈ పురస్కారానికి పరిశీలించరు.
1982కు ముందు, ఏదైనా ఒక రచనకు గాను సంబంధిత రచయితకు ఈ పురస్కారం ఇచ్చేవారు. అప్పటినుండి, భారతీయ సారస్వతానికి చేసిన సేవకు కూడా ఈ బహుమతిని ఇస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కన్నడ రచయితలు అత్యధికంగా ఎనిమిదిసార్లు ఈ పురస్కారం అందుకున్నారు. హిందీ రచయితలు ఆరుసార్లు అందుకున్నారు.