అగ్ని వంశ క్షత్రియులు లేక నియోగి బ్రాహ్మణ ప్రభువులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగ్ని వంశ క్షత్రియులు లేక నియోగి బ్రాహ్మణ ప్రభువులు
అగ్ని వంశ క్షత్రియులు లేక నియోగి బ్రాహ్మణ ప్రభువులు

అగ్ని వంశ క్షత్రియులు లేక నియోగి బ్రాహ్మణ ప్రభువులు అన్న గ్రంథాన్ని ప్రముఖ చారిత్రికుడు కోట వేంకటాచలం రచించారు. పౌరాణిక ఆధారాలను వివిధ చారిత్రిక, ఖగోళాంశాలతో బలపరిచి రచించిన ప్రత్యామ్నాయ చరిత్ర (ఆల్టర్నేట్ హిస్టరీ) కి చెందిన గ్రంథమిది.

రచనా నేపథ్యం[మార్చు]

బ్రిటీష్ ప్రభుత్వం తమ విద్యావిధానాన్ని, చరిత్ర అధ్యాయనాన్ని భారతదేశంలో ప్రారంభించాకా పురాతన కాలం నుంచి అవిచ్ఛిన్నంగా సాగుతున్న విద్యావ్యవస్థను కూలదోసి, పురాణేతిహాసాలను మరుగుపరిచి దేశచరిత్రను వక్రీకరించారని వలసవాదానంతర అధ్యయనకారులు పేర్కొన్నారు. భారతీయ పురాణ వాౙ్మయంలోని చరిత్రనంతా తోసివేసి బ్రిటీష్ వారు తమ ఆధిక్యత నిలుపుకునేందుకు చరిత్రను వక్రీకరించారని పేర్కొంటూ పలువురు జాతీయ భావాలు కలిగిన భారతీయ చరిత్రకారులు విభేదించారు. ఆ క్రమంలో సప్తర్షి మండల గతిని అనుసరించి వేలాది సంవత్సరాలు ఖరారుగా వ్రాసిపెట్టిన పురాణాలలోని చరిత్రను పునఃప్రతిష్ఠించేందుకు ప్రయత్నించినవారు కోట వేంకటాచలం. ఆ నేపథ్యంలో ఈ గ్రంథాన్ని రచించారు.

గ్రంథ వివరాలు[మార్చు]

బ్రాహ్మణులైన కణ్వ, శుంగ, శాతవాహన వంశాల పతనానంతరం దేశం హూణాది విదేశీయుల పరమైపోతున్న తరుణంలో రాజపుటానా (నేటి రాజస్థాన్) ప్రాంతంలోని కొందరు బ్రాహ్మణులు బయలుదేరి క్షాత్రంతో దేశాన్ని తిరిగి జాతీయ పాలన కిందకు తీసుకువచ్చారని ఈ గ్రంథంలో రచయిత వివరించారు. ఆ క్షాత్రమవలంబించిన బ్రాహ్మణుల సంతతి పరిపాలనకు సంబంధించిన ఉద్యోగాలలో ఈ మధ్య కాలం వరకూ కుదురుకున్నారని, వారినే ఆంధ్రదేశంలో "నియోగి బ్రాహ్మణులు" అంటున్నారని ఆయన పేర్కొన్నారు. వీటన్నిటికీ పురాణాలు మొదలైన చారిత్రిక గ్రంథాల ఆధారాలు చూపించారు వేంకటాచలం. ఆ నియోగి బ్రాహ్మణ ప్రభువులు లేదా అగ్నివంశ క్షత్రియుల పరిపాలన గురించి, ఉత్థాన పతనాల గురించి తెలిపారు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]