కోట వేంకటాచలం
కోట వెంకటాచలం | |
|---|---|
ఆంధ్రుల పుట్టుఫూర్వోత్తరములు పుస్తకంలో చిత్రం | |
| జననం | చల్లా వెంకటాచలం 1885 ఏప్రిల్ 21 కృష్ణా జిల్లా నూజివీడు మధునాపురం అగ్రహారం |
| మరణం | 1959 నవంబరు 12 |
| ఇతర పేర్లు | జగద్గురు శ్రీ అద్వయానంద శంకరభారతి (అభినవ విరూపాక్ష పీఠం) |
| వృత్తి | చరిత్ర పరిశోధకులు |
| భాగస్వామి | సీతారామమ్మ |
| పిల్లలు | కుమారులు ముగ్గురు కుమార్తెలు నలుగురు |
| తల్లిదండ్రులు |
|
కోట వెంకటాచలం (1885-1959) సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త, చరిత్ర పరిశోధకులు, విమర్శకులు.[1] ఈయన బ్రహ్మశ్రీ బిరుదు పొందినవాడు.
వీరు నూజివీడు తాలూకాలోని మధునాపురంలో చల్లా సుబ్బారాయుడు, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. చల్లావారి ఇంటిలో పుట్టినా కోటవారికి దత్తత వెళ్ళారు. వీరిని దత్తత తీసుకొన్న దంపతులు: కోట నిత్యానందం, లక్ష్మీదేవమ్మ.
వీరు సంస్కృతాంధ్ర భాషలు అధ్యయనం చేశారు; ఖగోళశాస్త్రంలో విశేషకృషి చేసారు. వాని ఆధారంగా భారతీయ చరిత్రను పునర్నిర్మించారు. సృష్టి ఆరంభం మొదలగు విషయాలలో పాశ్చాత్య విద్వాంసుల కాలగణనం, వారు వారు కూర్చిన భారతదేశ చరిత్ర సరైనవి కావని విమర్శించారు. మన పురాణాలలోనే భారతదేశ వాస్తవచరిత్ర దాగివుందని వీరి సిద్ధాంతం. ఆర్య విజ్ఞానం అనే పేరుతో ఒక బృహద్గ్రంథాన్ని వీరు 8 భాగాలుగా రాసి ప్రకటించాలని సంకల్పించారు. దానిలో మొదటి రెండు భాగాలుగా బ్రహ్మాండ సృష్టి విజ్ఞానము, మానవ సృష్టి విజ్ఞానము అనే గ్రంథాలను వీరు ప్రచురించారు. అవి పలువురి ప్రశంసలు పొందాయి.
సన్యాసం
[మార్చు]వీరు 1957 July 8న సన్యాస స్వీకరణ చేసి జగద్గురు శ్రీ అద్వయానంద శంకరభారతి (అభినవ విరూపాక్ష పీఠం) అను దీక్షా నామాన్ని స్వీకరించారు.
ఇతర రచనలు
[మార్చు]తెలుగు
[మార్చు]- అగ్ని వంశ క్షత్రియులు లేక నియోగి బ్రాహ్మణ ప్రభువులు[2]
- అభాస క్రైస్తవం
- అద్వైత బోధిని
- ఆంధ్రులెవరు?
- గుప్తరాజులెవరు?
- ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు (1955)
- కలియుగ రాజవంశములు (1950)
- బ్రహ్మాండ సృస్టి విజ్ఞానం
- కలిశక విజ్ఞానం 1,2,3
- మానవ సృస్టి విజ్ఞానం
- ఆర్యుల ధ్రువనివాస ఖండనము
- నిర్విచార జీవనం 1,2
- జంబూద్వీపము (అందలి వర్షవిభాగములు)
- ఆర్యుల మతము
- ఆర్యుల సర్వతోముఖ విజ్ఞానం
- ఆర్యుల ప్రపంచవ్యాప్తి
- అశోకుని కాలము నాటి యోన రాజులు
- భారతీయ శకములు
ఆంగ్లము
[మార్చు]- The Historicity of Vikramaditya & Salivahana
- Age of Buddha, Milinda & Amtiyoka And Yugapurana
- The Plot in Indian Chronology
- Age Of The Mahabharata War
- Chronology of Kashmir History Reconstructed
- Manavasrishti Vijnanam (The Genesis Of The Human Race)
- Chronology of Nepal History Reconstructed
- Indian Eras
మూలాలు
[మార్చు]- ↑ వెంకటాచలం, కోట, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 780
- ↑ వేంకటాచలం, కోట. అగ్ని వంశపు రాజులు లేక నియోగబ్రాహ్మణ ప్రభువులు. Retrieved 2020-07-11.