అజప్న్యాక్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అజప్న్యాక్
Աջափնյակ
నగరంలో అజప్న్యాక్ ప్రాంతం
నగరంలో అజప్న్యాక్ ప్రాంతం
ఎరుపు రంగులోని జిల్లా
ఎరుపు రంగులోని జిల్లా
దేశంఆర్మేనియా
మార్జ్ (రాజ్యం)యెరెవన్
Government
 • జిల్లా మేయర్హ్రయర్ ఆంటోన్యన్
విస్తీర్ణం
 • Total12 కి.మీ2 (5 చ. మై)
జనాభా
 (2011 జనాభా)
 • Total1,08,282
 • జనసాంద్రత9,000/కి.మీ2 (23,000/చ. మై.)
Time zoneUTC+4 (AMT)

అజప్న్యాక్, ఆర్మేనియా దేశ రాజధానయిన యెరెవాన్ లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. ఇది నగరానికి ఈశాన్యాన ఉంటుంది. అజప్న్యాక్ కు సరిహద్దులుగా తూర్పున అరబ్కిర్ జిల్లా, ఉత్తరాన దవ్తషెన్ జిల్లా, ఆగ్నేయంలో కెంట్రాన్ జిల్లా, దక్షిణాన మలాటియా-సెబష్టియా జిల్లాలు ఉన్నాయి. హ్రజ్డాన్ నది ఈ జిల్లాకు తూర్పు దిశలో ప్రవహిస్తుంది. అజప్న్యాక్ కు అర్మావిర్, అరగాట్సాన్ రాష్ట్రాలు పశ్చిమాన, కొటాయ్క్ రాష్టం ఉత్తరాన ఉన్నాయి.

అవలోకనం

[మార్చు]

ఇది యెవెరన్ నగరంలోని 11.21% భూభాగం అనగా 25 చ.కి. వైశాల్యంలో ఉన్నది. అజప్న్యాక్ వైశాల్యపరంగా యెరవాన్ లో నాల్గవ అతిపెద్ద జిల్లా. ఆర్మేనియన్ భాషలో అజప్న్యాక్ అంటే కుడి తీరం అని అర్ధము. హ్రజ్డాన్ నదికి ఈ జిల్లా కుడి వైపు ఉండడంతో ఈ పేరు వచ్చింది. ఇది అనధికారికంగా చిన్న విభాగాలుగా విభజింపబడినది అవి: నొరాషెన్, నజర్బెక్యాన్, సిలిక్యాన్, లుకాషిన్, వాహగ్ని, అనస్తసవన్, చేరిముష్కి. కెవోర్క్ చావుష్ స్క్వేర్, హలబ్యాన్ వీధి జిల్లా మధ్యప్రాంతంలోఉన్నయి. కెవార్క్-చావుష్ వీధి, షిరాజ్ వీధి, బషింజాగ్యన్ వీధి, మోవ్స్యెస్ సిలిక్యాన్ వీధి, అష్తారక్ రహదారి జిల్లాలోని ఇతర ముఖ్యమైన వీధులు. అజప్న్యాక్ ను మలాటియా-సెబష్టియా, కెంట్రాన్ జిల్లాల నుండి లెనింగ్రాడ్ వీధి వేరుచేస్తుంది.

తుమన్యన్ పార్కు నుండి అజప్న్యాక్

అజప్న్యాక్ లోని అనేక పార్కులను 21వ శతాబ్దంలో నిర్మించారు. వాటిలో తుమన్యన్ పార్కు, లిబరేటర్ పార్కు, బునస్ ఐర్స్ పార్కులు ముఖ్యమైనవి.

2016, జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో దాదాపుగా 109,100 మంది నివసిస్తున్నారు.

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లాలో 108,282 (యెరెవన్ నగరం జనాభాలోని 10.21%) మంది నివసిస్తున్నారు. 2016 అధికారిక అంచనాల ప్రకారం,109,100 తో నగరంలోని ఏడవ అత్యధిక జనాభా కలిగిన జిల్లా.

అజప్న్యాక్ జనాభాలో ప్రధానంగా అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చికు చెందిన వారు నివసిస్తున్నారు. కానీ 2017 ప్రకారం జిల్లాలో ఒక్క చర్చి కూడా లేదు.

సంస్కృతి

[మార్చు]
అజప్న్యాక్ లోని కెవోర్క్ చావుష్ విగ్రహం

అజప్న్యాక్ లోని మైఖేల్ మిర్జోయాన్ సంగీత పాఠశాలను 1957లో ప్రారంభమైంది. ఆవెట్ గబ్రీల్యాన్ ఆర్ట్ పాఠశాలను 1971 లో, మారటుక్ కల్చరల్ సెంటర్ ఆఫ్ ఎథ్నోగ్రాఫిక్ పాట, నృత్యం 1983 లో, అనాహిట్ త్సిత్సిక్యాన్ సంగీత 1987 లో, జార్టాంక్ పిల్లల సౌందర్య విద్య సెంటరు 1995 లో, అజప్న్యాక్ సౌందర్య విద్య సెంటరు 2001 లో ప్రారంభించారు.

రవాణా

[మార్చు]

హ్రజ్డాన్ నదికు కుడి వైపు ఉన్నది, ఆ నదిపై ఉన్న మహా హర్జ్డాన్ వంతెన ద్యారా ఇది యెరెమాన్ నగరంతో రవాణా సౌకర్యాన్ని కల్పించారు. అజప్న్యాక్ లో అనేక విదాలయిన ప్రజారవాణా సదుపాయాలు ఉన్నవి.

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]
ఉత్తర అజప్న్యాక్ లోని ఒక ప్రైవేటు భవనము

అజప్న్యాక్ లో ప్రధానంగా చిన్న చిల్లర, సేవ కేంద్రాలు నిలయం. జిల్లాలోని తూర్పు ప్రాంతంలోని ఒక చిన్న పారిశ్రామిక ప్రాంతం మలాటియా-సెబష్టియాతో తన సరిహద్దును పంచుకుంటూంది.

జిల్లాలోని అత్యధిక పారిశ్రామలు 21వ దశాబ్ధము మొదటిలో ప్రారంభమైనవి. అయితే, ప్రొష్యాన్ బ్రాందీ ఫ్యాక్టరీ 1885లో స్థాపించబడినా, అది ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో 1980 నుండి కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నవి వాటిలో ఎలక్ర్టానిక్ పరికరాల థర్మోసెట్ పరిశ్రమను 1987 లో, కరిటాస్ చెక్క ఉత్పత్తులు పరిశ్రమను 1995లో, అసా మిఠాయి ఉత్పత్తుల పరిశ్రమను 1997లో, వాటర్లాక్ అపారన్ మినరల్ వాటర్ ఫ్యాక్టరీను 2000లో, ప్రొ అల్ అల్యూమినియం నిర్మాణాలన పరిశ్రమను 2002లో, బిఒకాట్ పాల ఉత్పత్తుల పరిశ్రమను 2003లో, ప్రొమెట్ మెటల్ పైపుల పరిశ్రమను 2004లో, అపారన్-టాన్+ ఫ్యాక్టరీ పాల ఉత్పత్తుల మినరల్ వాటర్ పరిశ్రమను 2004 లో, మెగా షిన్ మెటల్-ప్లాస్టిక్ నిర్మాణాల పరిశ్రమను 2005లో, ఎలిట్ షాంట్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీను 2007 లో, మార్టిన్ స్టార్ ఆహార తయారీ సంస్థను 2007లో, అమేలియా మైనింగ్ కంపెనీను 2008లో, గార్య్ ప్లాస్ట్ ఫ్యాక్టరీను 2012లో, యెఫ్రెజ్ మెటల్ కట్టింగ్ యంత్రాల పరిశ్రమను 2016లో స్థాపించబడినవి ముఖ్యమైనవి. అనేక ఇతర చిన్న ఆహార ఉత్పత్తుల, బట్టల, ఎలక్ట్రానిక్ పరికరాల, భవన నిర్మాణ పదార్థాల పరిశ్రమలు కూడా ఉన్నవి.

యెరెవాన్ లోనే అతిపెద్ద ఆశుపత్రయిన అర్మేనియా రిపబ్లికన్ మెడికల్ సెంటర్ ఈ ప్రాంతంలోనే ఉంది.

విద్య

[మార్చు]
హ్రజ్డాన్ నదీ ఒడ్డున తుమో సెంటర్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్

విద్యాసంవత్సరం 2016-17 నాటికి, జిల్లాలో 20 ప్రభుత్వ పాఠశాలలు, 4 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రముఖ క్యు.ఎస్.ఐ ఇంటర్నేషనల్ పాఠశాల (1995లో ప్రారంభమైంది) కూడా ఉంది. జిల్లాలో ఒక వృత్తి పాఠశాల కూడా ఉంది.

అజప్న్యాక్ లో అనేక ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. అవి, హెబుసాక్ విశ్వవిద్యాలయం (తెరిచింది 1990లో),, యెరెవాన్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (1992లో ప్రారంభమైంది).

యెరెవాన్ ఫిజిక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటరును 1943లో స్థాపించారు. 1993 లో, ఆర్మేనియా యొక్క రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మోంటే మెల్కోనియన్ మిలిటరీ అకాడమీను ప్రారంభించబడింది. తరువాత తుమో సెంటర్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ను 2011 ప్రారంభించారు.

క్రీడ

[మార్చు]

అజప్న్యాక్ అనేక క్రీడా పాఠశాలలకు నిలయం:

  • అజప్న్యాక్ పిల్లలు, యువత యొక్క క్రీడ పాఠశాలను 1968 లో ప్రారంభించారు, ఇక్కడ ప్రత్యేకంగా హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, చెస్ లను నేర్పిస్తారు.
  • మల్లయుద్ధాల ప్రొఫెషనల్ ఫెడరేషన్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లను 2005లో ప్రారంభించారు.
  • అజప్న్యాక్ చెస్ పాఠశాల 2013లో ప్రారంభమైంది.

అరరట్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ వహాగ్ని వద్ద ఉంది.

సూచనలు

[మార్చు]