అజయపాలుడు(చాళుక్య రాజవంశం)
అజయపాలుడు(చాళుక్య రాజవంశం) | |
---|---|
King of Gurjara | |
పరిపాలన | c. 1171 – 1175 |
పూర్వాధికారి | Kumarapala |
ఉత్తరాధికారి | Mularaja II |
Spouse | Naikidevi |
రాజవంశం | Chaulukya |
మతం | Hinduism |
అజయపాలుడు (r. C.క్రీ.పూ. 1171 -క్రీ.పూ. 1175) గుజరాతు లోని చాళుక్య (సోలంకి) రాజవంశానికి చెందిన భారతీయ రాజు. ఆయన తన రాజధాని అనాహిలపాతక (ఆధునిక పటాను) నుండి ప్రస్తుత గుజరాతును పరిసర ప్రాంతాలను స్వల్ప కాలం పాలించాడు.
తన పూర్వీకుడు కుమారపాలుడు మాదిరిగా అజయపాలుడు జైన మతాన్ని పోషించలేదు. ఈ కారణంగా తరువాతి జైన చరిత్రకారులు ఆయనను ప్రతికూలంగా చిత్రీకరించారు. జైనులను హింసించారని, కుమారపాలకు కూడా విషం ఇచ్చారని జైనులు ఆరోపించారు. ఈ వాదనలు చారిత్రాత్మకంగా కచ్చితమైన ఆధారాలు లభించలేదు.
ఆరంభకాల జీవితం
[మార్చు]కుమారపాలుడి తరువాత అజయపాలుడు చాళుక్య సింహాసనం అధిష్ఠించాడు.[1] కవి సోమేశ్వర రాసిన సూరతోత్సవ ఆధారంగా అజయపాలుడు కుమారపాలుడి కుమారుడు. సోమేశ్వరుడు అజయపాల కుమారుడు రెండవ బీమా (బహుశా అజయపాలుడు) కు సమకాలీనుడు.[2]
కొంతమంది జైన రచయితలు అజయపాలుడిని కుమారపాలుడి మేనల్లుడైన మహిపాలుడి కుమారుడు అని అభివర్ణించారు. వీరిలో 13 వ శతాబ్దంలో హేమచంద్ర ద్విశ్రయ గురించి వ్యాఖ్యానం రాసిన అభయతిలక గని మొట్టమొదటి వాడు.[1] 14 వ శతాబ్దపు చరిత్రకారుడు మెరుతుంగా తన థెరవాలిలో కూడా ఈ వాదనను పునరావృతం చేసాడు. కాని అజయపాలుడిని కుమారపాలుడి కుమారుడిగా తన ప్రబంధ-చింతామణిలో వర్ణించాడు.[3] తరువాతి జైన చరిత్రకారులు జయసింహ సూరి, రాజశేఖర, జినమండన మొదలైన వారు అజయపాలుడు కుమారపాలుడి మేనల్లుడు అనే వాదనను పునరావృతం చేశారు.[1]
అజయపాలుడు కుమారపాలుడి కుమారుడు అని తెలుస్తోంది. తరువాతి జైన రచయితలు ఆయనను కుమారపాలుడి మేనల్లుడుగా ముద్రవేసి ప్రతికూలంగా చిత్రీకరించారు. ఎందుకంటే ఆయన జైన విశ్వాసాన్ని పోషించలేదు.[3]
సింహాసనం అధిష్టించుట
[మార్చు]సింహాసనం పొందటానికి అజయపాలుడు కుమారపాలుడిని చంపాడని తరువాతి జైన చరిత్రకారులు పేర్కొన్నారు. జయసింహ సూరి రచనల ఆధారంగా కుమారపాలుడు తన మేనల్లుడు అజయపాలుడిని కాదని ఆయన మనవడైన ప్రతాపమల్లుడిని తన వారసుడిగా నియమించాలనుకున్నాడు. ఆయన తన గురువు జైన నాయకుడు హేమచంద్ర సలహా తీసుకున్నాడు. హేమచంద్ర కుమారపాలుడితో మాట్లాడుతూ అజయపాలుడు రాజుగా ఉండటానికి తగినవాడు కాదని, బదులుగా ప్రతాపమల్లుడిని రాజుగాచేయమని సలహా ఇచ్చాడు. హేమచంద్ర శిష్యుడు, అజయపాలుడి స్నేహితుడు బాలచంద్ర ఈ సంభాషణ విని రాజు అయిన తరువాత తనను రాజ గురువుగా చేస్తానని వాగ్దానం చేసిన అజయపాలుడికి ఈ సమాచారం అందించాడు. అదివిని అజయపాలుడు హేమచంద్రను హతమార్చాడు. హేమచంద్ర మరణం తరువాత కుమారపాలుడు దుఃఖంతో అనారోగ్యానికి గురయ్యాడు. అజయపాలుడు పాలలో విషాన్ని కలిపి దానికి తెలిసిన విరుగుడును దాచాడు. కుమారపాలుడు విషంతో మరణించగా ఆయన తరువాత అజయపాలుడు సింహాసనం అధిష్టించాడు. ఈ పురాణాన్ని ఇతర చరిత్రకారులైన రాజశేఖర, జినమండన చిన్న వ్యత్యాసాలతో ఈ కథనాన్ని పునరావృతం చేశారు.[4]
ఈ రచన నిజమని అనిపించదు. ఎందుకంటే ఇది పూర్వ జైన చరిత్రకారులైన ప్రభుచంద్ర, మేరుతుంగా రాసిన రచనలలో పేర్కొనబడలేదు. అజయపాలుడు జైనమతాన్ని పోషించనందున, ప్రతికూల కథలో చిత్రీకరించడానికి తరువాతి చరిత్రకారులు ఈ కథలను అదనంగా చేర్చినట్లు తెలుస్తోంది.[1]
సైనిక జీవితం
[మార్చు]అజయపాలుడు కుమారపాలుడి నుండి వారసత్వంగా పొందిన భూభాగాన్ని నిలుపుకున్నట్లు తెలుస్తోంది. తరువాత తనరాజ్యంలో మాళ్వాను విలీనం చేసుకున్నాడు. ఇది మధ్యప్రదేశులోని ఉదయపూరులో లభించిన శాసనం ద్వారా ధ్రువీకరించబడింది. [6]
శాకంబరి చహ్మానులు
[మార్చు]ఒక సిద్ధాంతం ఆధారంగా అజయపాలుడు శపథాలక్షకు చెందిన శాకంభరి చాహమాన్ పాలకుడిని (బహుశా సోమేశ్వరుడు) లొంగదీసుకున్నాడు. ఆయన కుమారుడు భీముడి తామ్రఫలక శాసనాలలో కరాదికృత-శపథాలక్ష-క్షాపాలుడు అన్న సూచన ఇందుకు ఆధారంగా ఉంది. 13 వ శతాబ్దపు కీర్తి-కౌముది, జంగల-దేశా రాజు (అంటే శపథాలక్ష) అజయపాలుడికి పరిహారంగా స్వర్ణభవనం కొన్ని ఏనుగులను ఇవ్వవలసి ఉందని పేర్కొంది. మరో రచయిత అరిసింహ, శపథాలక్ష రాజు అజయపాలుడికి రజిత భవనం సమర్పించాడని పేర్కొన్నాడు. జంగల రాజు అజయపాలుడికి బహుమతులు పంపేవాడు అని చరిత్రకారుడు బాలచంద్ర పేర్కొన్నాడు.[2]
ఈ ప్రకటనల ఆధారంగా చరిత్రకారులు అశోకే మజుందారు, దశరథ శర్మ అజయపాల సోమేశ్వరుడిని ఓడించి, ఆయన నుండి నివాళి స్వీకరించాడని సిద్ధాంతీకరించారు.[2][7] మరొకవైపు చరిత్రకారుడు ఆర్. బి. సింగ్, 'నివాళి' కేవలం సింహాసనం అధిరోహణ మీద అజయపాలుడికి సోమేశ్వరుడు పంపిన బహుమతి అని సిద్ధాంతీకరించాడు; ఈ సంఘటన గుజరాతు కవులు అజయపాలుడి విజయాలను అతిశయోక్తిగా వర్ణించారని భావించబడుతుంది. తన సిద్ధాంతానికి మద్దతుగా, కుమారపాలుడి మరణం తరువాత చాళుక్య శక్తి గణనీయంగా బలహీనపడిందని వారు ఈ సమయంలో శక్తివంతమైన చాహమానాలను అణచివేయలేకపోయారని సింగు వాదించాడు.[8]
మెడపాత గుహిలాలు
[మార్చు]అజయపాలుడు మెడపాత (ఆధునిక మేవారు) గుహిలా పాలకుడు సమంతాసింహ మీద యుద్ధం చేశాడు. గతంలో గుహిలాలు చాళుక్యులకు లొంగిపోయారు. సమంతసింహ చాళుక్య ఆధిపత్యాన్ని త్రోసివేయాలని ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. సమంతసింహ అజయపాలుడి మీద కొంత విజయాన్ని సాధించినట్లు తెలుస్తుంది. కాని చివరికి అజయపాలుడి సామంతుడైన అబూపర్వతప్రాంతంలోని పరమరా అధిపతి ప్రహ్లాదనుడి చేతిలో ఓడిపోయాడు. సా.శ. 1231 అబూ ప్రశాస్తి శాసనం దీనిని సూచిస్తుంది. అయినప్పటికీ తరువాతి కాలంలో సమంతాసింహుడు యుద్ధరంగంలో గుర్జారా రాజు (అంటే అజయపాలుడు) శక్తిని విచ్ఛిన్నం చేయడానికి ప్రహ్లాదనుడికి మద్ధతు ఇచ్చాడని పేర్కొనబడింది.[9]
సుకృత-కీర్తి-కల్లోలిని అనే రచనలో అజయపాలుడు శత్రురాజును తృటిలో ఓడించిన సంఘటన గురించి ప్రస్తావించబడింది. ఇది బహుశా సమంతసింహతో అతని సంఘర్షణకు సూచనగా భావించబడింది.[9]
మరణం
[మార్చు]అజయపాలుడు 1175 మార్చి 7 ఏప్రిలు మద్య మరణించాడని భావిస్తున్నారు. వయజలదేవ అనే ప్రతిహారుడు అజయపాలుడిని పొడిచి చంపాడని 14 వ శతాబ్దపు చరిత్రకారుడు మెరుతుంగా పేర్కొన్నాడు. ఈ వాదన సందేహాస్పదంగా ఉంది. ఎందుకంటే అజయపాలుడి గురించి మెరుతుంగా రచనలు సాధారణంగా విశ్వసించతగినవిగా భావించబడలేదు.[10]
అజయపాలుడు, నాయకిదేవిల కుమారుడు రెండవ ములరాజా ఆయన తరువాత చాళుక్య సింహాసనం అధిష్టించాడు. ములరాజా మరణం తరువాత అజయపాలుడి చిన్న కుమారుడు రెండవ బీమా సింహాసనాన్ని అధిష్టించాడు.[11]
మతం
[మార్చు]అజయపాలుడు బ్రాహ్మణ మతవిశ్వాసాలను పోషించాడు. ఆయన పూర్వీకుడు కుమారపాలుడు జైనమతానికి గొప్ప పోషకుడుగా ఉన్నాడు. చాళుక్య సైన్యాధ్యక్షుడు శ్రీధర దేవపట్టణ ప్రశస్తి శాసనం అజయపాల వేద మతవృక్షం తిరిగి పెరగడానికి కారణమయ్యాడని ప్రగల్భాలు పలుకుతుంది.[12]
అజయపాలుడి శాసనాలు అలాగే ఆయన కొడుకుల శిలాశాసనాలు ఆయనను పరమ-మహేశ్వరుడు ("శివుని భక్తుడు") గా వర్ణించాయి. ఇది చాళుక్యులకు అసాధారణమైనది. సమకాలీన కవి సోమేశ్వరుడి రచన ఆధారంగా అజయపాలుడు శివుడిని ప్రతిరోజూ ఆరాధించేవాడని, బ్రాహ్మణులకు మంచి బహుమతులు లభించాయి అని భావించారు.[12]
జైన రచనలలో
[మార్చు]తరువాతికాలంలో అజయపాలుడు జైనులను హింసించాడని జైన చరిత్రకారులు ఆరోపించారు. ఈ వాదన చారిత్రాత్మకంగా సరైనదని అనిపించదు: ఈ జైన రచయితలు అజయపాలుడిని ప్రతికూలంగా చిత్రించారు. ఎందుకంటే కుమారపాలుడిలా ఆయన జైనమతానికి మద్దతు ఇవ్వలేదు.[1]
అజయపాలుడిని ప్రతికూలంగా ప్రదర్శించిన తొలి జైన రచయిత మెరుతుంగా (14 వ శతాబ్దపు చరిత్రకారుడు). ఆయన అజయపాల దుర్మార్గాల గురించి ఈ క్రింది కథనాన్ని ఇస్తాడు: కుమారపాల నిర్మించిన దేవాలయాలను అజయపాలుడు నాశనం చేయడం ప్రారంభించాడు. అయినప్పటికీ ఆయన ఒక విదూషకుడి వ్యంగ్య వ్యాఖ్యలు విన్న తరువాత అలాంటి కార్యకలాపాలను ఆపాడు. కుమారపాలుడి పాలనలో శిలాహర రాజు మల్లికార్జున మీద విజయవంతమైన సైనిక పోరాటానికి నాయకత్వం వహించిన సైన్యాధ్యక్షుడు అమ్రభట (లేదా అంబడా), అజయపాలుడిని కొత్త రాజుగా అంగీకరించడానికి నిరాకరించిన ఫలితంగా అజయపాలుని సైనికులు అమ్రభటుని చంపారు. కొత్తగా నియమితులైన ముఖ్యమంత్రి కపర్దినుడిని సజీవంగా కాల్చాలని అజయపాలుడు ఆదేశించాడు. ఆయన హేమచంద్ర విద్యార్థి రామచంద్రను వేడిచేసిన రాగి ఫలకం మీద ఉంచి చంపాడు.[13]
జయసింహ సూరితో ప్రారంభమైన మెరుతుంగా అనంతర చరిత్రకారులు, అజయపాలుడు కుమారపాలుడికి విషం ఇచ్చాడని ఆరోపించారు.[6]
మెరుతుంగకు ముందు జైన రచయితలు, అజయపాలుడి సమకాలీనులతో సహా, అజయపాలుడి జైన వ్యతిరేక కార్యకలాపాల గురించి ప్రస్తావించలేదు. ఉదాహరణకు యషాపాల అజయపాలుడు గొప్ప రాజుగా అభివర్ణిస్తాడు. తనను తాను "అజయదేవ కమలపాదాలకు పాదాలకు హంస" (అంటే అజయపాల) గా అభివర్ణిస్తాడు. సోమప్రభా తన సతార్థ-కావ్యంలో కూడా అజయపాలుడిని ప్రశంసించాడు. [12]
అజయపాలను అరిసింహ, బాలచంద్ర కూడా ప్రశంసించారు. ఉదయప్రభ ఆయనను ఇంద్రుడితో పోలుస్తుంది. వాస్తుపాల-తేజపాల ప్రశస్తి శాసనం ఆయన ఆత్మ నియంత్రణను మెచ్చుకుంటుంది. మణికాచంద్ర, తన పార్శ్వనాథ-చరిత (సా.శ.1219)కుమారపాలుడు, అజయపాలుడు రాజ్యసభలలో జైనపాలకుడు " వర్ధమానుడు " ఒక ఆభరణం అని వర్ణించబడింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 Asoke Kumar Majumdar 1956, p. 126.
- ↑ 2.0 2.1 2.2 Asoke Kumar Majumdar 1956, p. 127.
- ↑ 3.0 3.1 Asoke Kumar Majumdar 1956, pp. 126–127.
- ↑ Asoke Kumar Majumdar 1956, p. 125.
- ↑ Asoke Kumar Majumdar 1956, p. 501.
- ↑ 6.0 6.1 6.2 Asoke Kumar Majumdar 1956, p. 130.
- ↑ Dasharatha Sharma 1959, p. 70.
- ↑ R. B. Singh 1964, pp. 157–158.
- ↑ 9.0 9.1 Asoke Kumar Majumdar 1956, p. 128.
- ↑ Asoke Kumar Majumdar 1956, p. 131.
- ↑ Asoke Kumar Majumdar 1956, p. 138.
- ↑ 12.0 12.1 12.2 Asoke Kumar Majumdar 1956, p. 129.
- ↑ Asoke Kumar Majumdar 1956, pp. 128–129.
గ్రంధ సూచిక
[మార్చు]- Asoke Kumar Majumdar (1956). Chaulukyas of Gujarat. Bharatiya Vidya Bhavan. OCLC 4413150.
- Dasharatha Sharma (1959). Early Chauhān Dynasties. S. Chand / Motilal Banarsidass. ISBN 9780842606189.
- R. B. Singh (1964). History of the Chāhamānas. N. Kishore. OCLC 11038728.