Jump to content

అజయ్ కుమార్ మండల్

వికీపీడియా నుండి
అజయ్ మండల్
అజయ్ కుమార్ మండల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 మే 23
ముందు శైలేష్ కుమార్ మండల్
నియోజకవర్గం భాగల్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (యునైటెడ్)
నివాసం బీహార్
వృత్తి రాజకీయ నాయకుడు

అజయ్ కుమార్ మండల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భాగల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

ఆయన బీహార్ శాసనసభకు నాథ్‌నగర్ నుండి రెండుసార్లు, కహల్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అజయ్ కుమార్ మండల్ జనతాదళ్ (యునైటెడ్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భాగల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్‌జేడీ అభ్యర్థి శైలేష్ కుమార్ పై 2,77,630 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అజీత్ శర్మపై 1,04,868 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Bhagalpur Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. the original నుండి 26 November 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 November 2025.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bhagalpur". the original నుండి 31 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 July 2024.