అంపిలేపి

వికీపీడియా నుండి
(అడవి మామిడి నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అంపిలేపి ఒక ఆకులు రాల్చే వృక్షం, సాధారణంగా 10 నుంచి 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది, కొన్ని సందర్భాలలో 27 మీటర్ల ఎత్తు కూడా పెరుగుతుంది. అంపిలేపిని అడవిమామిడి, అధ్వము, అంబాళము అని కూడా అంటారు. ఈ చెట్టును ఆంగ్లంలో వైల్డ్ మ్యాంగో (Wild Mango), ఇండియన్ హాగ్ ప్లం (Indian hog plum) అంటారు. ఈ చెట్టు యొక్క వృక్ష శాస్త్రీయ నామం స్పాండియాస్ మ్యాంగిఫిరా (Spondias mangifera), ఇది అనకార్డియేసి కుటుంబానికి చెందినది. ఈ చెట్టు పసుపు గోధుమ రంగుతో కూడిన మృదువైన శాఖలతో ఉంటుంది. ఆకు కాడలు 10 నుంచి 15 సెం.మీ. పొడవు ఉంటాయి. 5 నుంచి 11 ఎదురెదురుగా ఉన్న చిన్న ఆకుల సమ్మేళనంతో రెమ్మలు 30 నుంచి 40 సెం.మీ. పొడవు ఉంటాయి. చిన్న ఆకులు (లీఫ్లెట్స్) దీర్ఘచతురస్ర అండాకారం నుంచి దీర్ఘచతురస్ర వృత్తాకారం వరకు 7 నుంచి 12 సెంటీమీటర్ల పొడవు, 4 నుంచి 5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. ఆకు పునాది భాగం కొడవలి ఆకారం నుంచి గుండ్రని ఆకారంలో మొదలై తరచుగా ఏటవాలుగా ఉండి చివరన మొన వలె ఉంటుంది.

పూత[మార్చు]

మార్చి, ఏప్రిల్ నెలల్లో పుష్పిస్తుంది.

ఆయుర్వేదం[మార్చు]

చెట్టు బెరడు మరియు కాయలను ఆయుర్వేద ఔషధాలలోను వివిధ మెడిసిన్ల తయారిలోను విరివిగా వినియోగిస్తున్నారు.

అంపిలేపి(కొండ మామిడి)చెట్టు Spondias mangifera

ఇవి కూడా చూడండి[మార్చు]

స్పాండియాస్

మామిడి

నక్షత్రవనం లోని ఒక చెట్టు ఇది.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అంపిలేపి&oldid=2209708" నుండి వెలికితీశారు