అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా
అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా ఒక కీర్తన. దీనిని కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి రచించారు.
ఈ కీర్తనను ఖరహరప్రియ జన్యమైన మధ్యమావతి రాగం, రూపక తాళంలో గానం చేస్తారు.[1]
కీర్తన
[మార్చు]- పల్లవి
అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా ? ఆదిమూలమా ! రామ ! ॥అడిగి॥
- అనుపల్లవి
సడలని పాప తిమిరకోటి సూర్య ! సార్వభౌమ! సారసాక్ష! సద్గుణ !ని ॥న్నడిగి॥
- చరణము 1
అశ్రయించి వరమడిగిన సీత
యడవికిఁ బోనాయె;
ఆశరహరణ ! రక్కసి ఇష్టమడగ
నపుడే ముక్కువోయె; ఓ రామ !ని ॥న్నడిగి॥
- చరణము 4
నీకేఁ దయబుట్టి బ్రోతువో ! బ్రోవవో !
నీ గుట్టు బయలాయె;
సాకేతధామ ! శ్రీత్యాగరాజనుత !
స్వామి! యేటి మాయ ? ఓరామ !ని ॥న్నడిగి॥
సంగీత సంప్రదాయంలో
[మార్చు]
అడిగి సుఖములెవ్వరనుభవించిరిరా అనే కీర్తన కర్ణాటక సంగీత సంప్రదాయంలో బహుళ ప్రాచుర్యం పొందింది. సంగీత కచేరీలలో, గాయకులు విడుదల చేసే రికార్డులు, సీడీలు వంటి వాటిలో ఈ కీర్తనను కూడా పలువురు ప్రఖ్యాత విద్వాంసులు ఆలపించి వినిపించారు. ఈ కీర్తనను డి.కె.పట్టమ్మల్ సాంప్రదాయబద్ధంగా గానం చేశారు.[2]
పూర్తి పాఠం
[మార్చు]- వికీసోర్స్లో అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా పూర్తి కీర్తన.
మూలాలు
[మార్చు]- ↑ కర్ణాటిక్ సైట్ లో ఈ కీర్తన సాహిత్యం.
- ↑ "డి.కె.పట్టమ్మల్ గానం చేసిన అడిగి సుఖము కీర్తన ఆడియో రాగా.కాం లో వినండి". Archived from the original on 2010-08-10. Retrieved 2011-10-31.