Jump to content

అడే గజేందర్

వికీపీడియా నుండి

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో జన్మించిన అడే గజేందర్ గ్రాడ్యుయేషన్తో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.

2019లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆడే గజేందర్ ఆ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి వరకు అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.

బోథ్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు టికెట్ దక్కనప్పుడు పార్టీలు మారినప్పటికీ అదే గజేంద్ర మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ పార్టీని పటిష్ఠం చేయడంలో ముఖ్యపాత్ర పోషించారు.

నియోజకవర్గంలో తన కేడర్ను పెంచుకుంటూ ఎల్లప్పుడూ అటు పార్టీ అధిష్టానానికి ఇటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ వారి మధ్యనే ఎదుగుతూ వచ్చారు గజేందర్.

గజేందర్ పనితీరుని మెచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అతనికి బోథ్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది .

2023 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బోథ్ శాసనసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఆధారం

[మార్చు]

[1]

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.