అతడే శ్రీమన్నారాయణ
స్వరూపం
| అతడే శ్రీమన్నారాయణ | |
|---|---|
| దర్శకత్వం | సచిన్ రవి |
| నిర్మాత | హె.కె.ప్రకాష్ పుష్కర మల్లికార్జునయ్య |
| తారాగణం | రక్షిత్ శెట్టి
|
| ఛాయాగ్రహణం | కార్మ్ చావ్లా |
| కూర్పు | సచిన్ రవి |
| సంగీతం |
|
నిర్మాణ సంస్థలు | పుష్కర్ ఫిలిమ్స్ శ్రీ దేవి ఎంటెర్టైనెర్స్ పారంవా స్టూడియోస్ |
| పంపిణీదార్లు | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2019 డిసెంబరు 27 |
సినిమా నిడివి | 184 నిమిషాలు |
| దేశం | |
| భాష | కన్నడ |
అతడే శ్రీమన్నారాయణ 2019లో విడుదలైన కన్నడ సినిమా. పుష్కర్ ఫిలిమ్స్, శ్రీ దేవి ఎంటెర్టైనెర్స్, పారంవా స్టూడియోస్ బ్యానర్ల పై హెచ్.కె.ప్రకాష్, పుష్కర మల్లికార్జునయ్య నిర్మించిన ఈ సినిమాకు సచిన్ రవి దర్శకత్వం వహించాడు.[1] రక్షిత్ శెట్టి, శాన్వీ శ్రీవాస్తవ, అచ్యుత్ కుమార్, బాలాజీ మనోహర్, ప్రమోద్ శెట్టి, మధుసూదన్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2020 జనవరి 01న విడుదలైంది.
కథ
[మార్చు]అమరావతికి చెందిన ఆధీరులు అనే దొంగల జాతి పెద్ద రామరాజు తన తదనంతరం వారసుడు ఎవరు అనేది ప్రకటించకుండానే చనిపోతాడు. దాంతో అతడి వారసులు పెత్తనం & నిధి కోసం కొట్టుకు చస్తుంటారు. ఈ గొడవలోకి తనకు తెలియకుండానే ఎంటర్ అవుతాడు పోలీస్ ఇన్స్పెకర్ శ్రీమన్నారాయణ (రక్షిత్ శెట్టి). అసలు నిధి ఎవరిది? అది ఎక్కడ ఉంది? చివరికి ఎవరికి దొరికింది? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
[మార్చు]- రక్షిత్ శెట్టి
- శాన్వీ శ్రీవాస్తవ
- అచ్యుత్ కుమార్
- బాలాజీ మనోహర్
- ప్రమోద్ శెట్టి
- మధుసూదన్ రావు
- రిషబ్ శెట్టి - అతిధి పాత్రలో
- యోగరాజ్ భట్, గుప్తానంద స్వామీజీగా - అతిధి పాత్రలో
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: పుష్కర్ ఫిలిమ్స్, శ్రీ దేవి ఎంటెర్టైనెర్స్, పారంవా స్టూడియోస్
- నిర్మాతలు: హెచ్.కె.ప్రకాష్, పుష్కర మల్లికార్జునయ్య
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సచిన్ రవి
- సంగీతం: చరణ్‌రాజ్, బి. అజనీష్ లోక్‌నాథ్
- సినిమాటోగ్రఫీ:కార్మ్ చావ్లా
- ఎడిటింగ్: సచిన్ రవి
మూలాలు
[మార్చు]- ↑ "'రంగస్థలానికి కొత్త ఆటగాడు వచ్చాడు' అతడే." Eenadu. 25 March 2023. Archived from the original on 2 September 2025. Retrieved 2 September 2025.
- ↑ "అతడే శ్రీమన్నారాయణ : రివ్యూ". TV9 Telugu. 1 January 2020. Archived from the original on 2 September 2025. Retrieved 2 September 2025.