Jump to content

రక్షిత్ శెట్టి

వికీపీడియా నుండి
రక్షిత్ శెట్టి
2020లో రక్షిత్ శెట్టి
జననం (1983-06-06) 1983 జూన్ 6 (వయసు 41)
విద్యాసంస్థNMAM ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
వృత్తి
  • సినిమా నిర్మాత
  • నటుడు
  • రచయిత
  • దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

రక్షిత్ శెట్టి (జననం 1983 జూన్ 6) భారతీయ నటుడు, కన్నడ సినిమా నిర్మాత.[1]

విద్య, ఉద్యోగం

[మార్చు]

ఉడిపిలో 1983 జూన్ 6న తుళు మాట్లాడే బంట్ కుటుంబంలో రక్షిత్ శెట్టి జన్మించాడు.[1][2][3] స్వగ్రామంలోనే పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆయన కన్నడ చిత్రసీమలో అడుగుపెట్టేముందు N.M.A.M ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. రెండు సంవత్సరాలపాటు సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా కూడా పనిచేశాడు.[4][5]

కెరీర్

[మార్చు]

లెట్స్ కిల్ గాంధీ వంటి అనేక విడుదల కాని చిత్రాలతో రక్షిత్ శెట్టి తన కెరీర్‌ను షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా ప్రారంభించాడు. అరవింద్ కౌశిక్ దర్శకత్వం వహించిన నామ్ ఏరియల్ ఒండ్ దిన (2010), తుగ్లక్ (2013) లతో చలనచిత్రాలలో ప్రవేశించాడు. అయితే సింపుల్ అగి ఓంద్ లవ్ స్టోరీ (2013)తో విజయం సాధించాడు. దక్షిణ కన్నడ ప్రాంతాన్ని కన్నడ చలనచిత్ర పరిశ్రమలోకి తీసుకురావడానికి ఆయన ప్రసిద్ధి చెందాడు.

సింపుల్ అగి ఓంధ్ లవ్ స్టోరీ విజయం తరువాత దర్శకుడు, నిర్మాత అయిన సింపుల్ సుని, రక్షిత్ శెట్టి మొదటగా దర్శకత్వం వహించిన ఉలిదవరు కందంటే (2014) చిత్రానికి పెట్టుబడి పెట్టేలా చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరు హిట్ అయినప్పటికీ తరువాత కల్ట్ ఫాలోయింగ్ పొందింది. తుళునాడు ప్రజలను చిత్రీకరించడంలో ప్రాంతీయ ప్రామాణికతకు ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. స్కార్‌ఫేస్, షోలే వంటి క్లాసిక్‌లు, పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్‌తో సహా టరాన్టినో అనేక చిత్రాలకు కూడా ఈ చిత్రం దీటుగా నిలిచింది.

స్క్రీన్ రైటింగ్ నుండి 2 సంవత్సరాల విరామం తర్వాత ఆయన 2016 కాలేజ్ కామెడీ చిత్రం కిరిక్ పార్టీతో తిరిగి వచ్చాడు, ఇది బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది. భారతీయ కళాశాలల చిత్రణ చాలా సూక్ష్మంగా, హాస్యభరితంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. దీంతో కర్నాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డుతో పాటు పలు ప్రశంసలు అందుకున్నాడు. ఈ కిరిక్ పార్టీ చిత్రం 2018లో తెలుగులో కిరాక్ పార్టీగా రీమేక్ చేయబడింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కిరిక్ పార్టీ చిత్రం నిర్మాణ సమయంలో రక్షిత్ శెట్టి తన సహనటి రష్మిక మందన్నతో ప్రేమలో పడి 2017 జూలై 3న ఆమె స్వస్థలమైన విరాజ్‌పేటలో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు.[6] ఆ తరువాత అనుకూలత సమస్యలను ఉటంకిస్తూ 2018 సెప్టెంబరులో ఈ జంట పరస్పరం తమ నిశ్చితార్థాన్ని విరమించుకున్నారు.[7]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
Year Film Award Category Result Ref.
2015 ఉలిదవారు కందంటే 62వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ దర్శకుడు విజేత [8]
ఉత్తమ నటుడు నామినేట్ చేయబడింది
ఉత్తమ గీత రచయిత నామినేట్ చేయబడింది
2014 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు దర్శకుడి ఫస్ట్ టైమ్ బెస్ట్ ఫిల్మ్ విజేత [9]
బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్ బెస్ట్ ఫిల్మ్ మేకర్ కన్నడ విజేత [10]
2017 గోధి బన్న సాధారణ మైకట్టు KAFTA అవార్డులు ఉత్తమ సాహిత్యం విజేత [11]
IIFA ఉత్సవం సహాయక పాత్రలో ప్రదర్శన - పురుషుడు విజేత [12]
కిరిక్ పార్టీ ఉత్తమ చిత్రం విజేత
ప్రధాన పాత్రలో ప్రదర్శన - పురుషుడు విజేత
ఉత్తమ సాహిత్యం విజేత
ఉత్తమ కథ నామినేట్ చేయబడింది
2016 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విజేత [13]
64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటుడు నామినేట్ చేయబడింది [14]
ఉత్తమ గీత రచయిత నామినేట్ చేయబడింది
క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ – సౌత్ విజేత
6వ SIIMA అవార్డులు ఉత్తమ చిత్రం విజేత [15]
ఉత్తమ నటుడు నామినేట్ చేయబడింది
ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ విజేత
2021 అవనే శ్రీమన్నారాయణ 9వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ చిత్రం నామినేట్ చేయబడింది [16],[17]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Read about Rakshit Shetty's books of dreams". The Times of India. 27 January 2015. Retrieved 17 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Bunts Premiere League cricket tourney from May 24 | Mangaluru News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). TNN. May 22, 2019. Retrieved 2021-07-17.
  3. "Rakshit Shetty, Pruthvi Ambaar, and others pursue Tulu's inclusion in the eighth schedule". The Times of India (in ఇంగ్లీష్). 14 June 2021. Retrieved 17 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Rakshit Shetty is a BE graduate". The Times of India. Retrieved 5 March 2017.
  5. "Talking Cinema with Rakshit Shetty". themanipaljournal.com. 26 August 2014. Archived from the original on 29 December 2014. Retrieved 5 March 2017.
  6. "Rakshit, Rashmika get engaged in Virajpet". Deccan Herald (in ఇంగ్లీష్). 4 July 2017. Retrieved 30 November 2019.
  7. "Rashmika Mandanna calls of engagement with Rakshit Shetty". www.indiatoday.com.
  8. "Winners of 62nd Britannia Filmfare Awards South". Filmfare. filmfare.com. 27 June 2015. Retrieved 27 June 2015.
  9. "Rakshit Shetty bagged state award the best debut director award for Ulidavaru Kandante". The Times of India.
  10. "Behindwoods Gold Medals 2014,2015 - Film Awards for best movies, actors and technicians - Chennai". Behindwoods.
  11. "#TimesKAFTA: Celebrating film technicians". The Times of India. 24 September 2017. Retrieved 14 November 2017.
  12. "'Janatha Garage', 'Kirik Party' bag top honours at IIFA Utsavam 2017". Business Standard India. 30 March 2017. Archived from the original on 30 March 2017. Retrieved 3 April 2017.
  13. "Karnataka State Film Award Winners for 2016 - Times of India". The Times of India. Retrieved 25 June 2017.
  14. "Karnataka State Film Award Winners for 2016 - Times of India". The Times of India. Retrieved 25 June 2017.
  15. "Kirik Party sweeps 6 awards at SIIMA - Times of India". The Times of India. Retrieved 2017-07-07.
  16. "The 9th South Indian International Movie Awards Nominations for 2019". South Indian International Movie Awards. Archived from the original on 28 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
  17. "SIIMA 2020: Check Out Full Winners' List". ibtimes. Retrieved 20 September 2021.