అతుల్ బెదాడే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అతుల్ బెదాడే
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ1966, జూన్ 24
ముంబై, మహారాష్ట్ర
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే ఫస్ట్-క్లాస్
మ్యాచ్‌లు 13 64
చేసిన పరుగులు 158 3,136
బ్యాటింగు సగటు 22.57 33.36
100లు/50లు 0/1 10/15
అత్యధిక స్కోరు 51 159
వేసిన బంతులు 374
వికెట్లు 2
బౌలింగు సగటు 70.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/6
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 26/–
మూలం: CricInfo, 2006 మార్చి 7

అతుల్ చంద్రకాంత్ బెదాడే, మహారాష్ట్రకు చెందిన మాజీ భారత క్రికెట్ ఆటగాడు.[1] బరోడా తరపున దేశీయ క్రికెట్ ఆడిన అతుల్, 13 అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.[2]

జననం[మార్చు]

అతుల్ 1996, జూన్ 24న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం[మార్చు]

1994లో షార్జాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో తన అరంగేట్రం చేసిన అతుల్,[4] క్రికెట్ బాల్‌లో పెద్ద హిట్టర్ గా, అటాకింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఘనత పొందాడు. 90వ దశకం ప్రారంభంలో భారత క్రికెట్ సర్కిల్‌లలో గట్టిగా కొట్టగల బ్యాట్స్‌మెన్ కోసం వచ్చిన పిలుపులో అతుల్ కి అవకాశం లభించింది. అయితే అతనిపై సిక్సర్లు కొట్టాలనే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది. షార్జాలో పాకిస్తాన్‌తో జరిగిన అదే సిరీస్‌లో అతను తన సామర్థ్యాన్ని ప్రదర్శించినప్పటికీ (భారత్ ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది), అతనికి ఇచ్చిన ఇతర అవకాశాలలో అతని హిట్టింగ్ చాలా తక్కువ ఉంది. దాంతో వెంటనే తొలగించబడిన అతుల్ కు మళ్ళీ అవకాశం రాలేదు. 1994, నవంబరు 11న జైపూర్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[5]

పదవి విరమణ తర్వాత[మార్చు]

అతుల్ వివిధ హోదాల్లో క్రికెట్‌లో పాలుపంచుకున్నాడు. 2006లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా మాజీ క్రికెటర్ల కోసం ప్రమోట్ చేస్తున్న అంపైర్ల పరీక్షకు హాజరైన ముప్పై ఐదు మంది మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్లలో అతనే ఏకైక భారత మాజీ ఆటగాడు. ఏడు సంవత్సరాల తర్వాత 2013లో, బిసిసిఐ క్యూరేటర్స్ సర్టిఫికేషన్ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన ఏకైక భారత మాజీ ఆటగాడిగా అతుల్ మరొక 'మొదటి' రికార్డును సృష్టించాడు. అతుల్ బిసిసిఐ - నేషనల్ క్రికెట్ అకాడమీ నుండి డబుల్ కోచింగ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉన్నాడు.

రాజకీయాలు[మార్చు]

2010 సెప్టెంబరులో అతుల్ భారతీయ జనతా పార్టీ టికెట్‌పై వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వార్డు నంబరు 20 నుండి పోటీ చేశాడు. బిజెపిలో చురుకుగా పాల్గొన్న అతుల్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్రీడా విభాగమైన క్రీడా భారతిలో కీలక సభ్యుడిగా కూడా ఉన్నాడు.[6]

మూలాలు[మార్చు]

  1. "Atul Chandrakant Bedade Profile - Cricket Player, India | News, Photos, Stats, Ranking, Records - NDTV Sports". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-06.
  2. "Atul Bedade Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-06.
  3. "Atul Bedade Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-06.
  4. "IND vs UAE, Pepsi Austral-Asia Cup 1993/94, 1st Match at Sharjah, April 13, 1994 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-06.
  5. "IND vs WI, West Indies tour of India 1994/95, 5th ODI at Jaipur, November 11, 1994 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-06.
  6. Vadodara Municipal Elections 2010

బయటి లింకులు[మార్చు]