అత్తలూరి విజయలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అత్తలూరి విజయలక్ష్మి
అత్తలూరి విజయలక్ష్మి.jpg
ఇతర పేర్లుఅత్తలూరి విజయలక్ష్మి
ప్రసిద్ధితెలుగు రచయిత్రి

అత్తలూరి విజయలక్ష్మి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఈమె అనేక కథలు, నవలలు, నాటికలు వ్రాసారు. ఈమె పబ్లిక్ రిలేషన్స్‌లో డిగ్రీ చదవి, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై సీవరేజ్‌ బోర్డులో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంలో అధికార హోదాలో పదవీ విరమణ పొందారు. ఈమె సరసిజ అనే పేరుతో ఒక సాహిత్య సంస్థను నెలకొల్పారు.

జననం: తెనాలి... (ఆంధ్రప్రదేశ్) లో కీ.శే. ఏ.ఎల్. నరసింహా రావు, ప్రముఖ జర్నలిస్ట్., రాయిస్ట్. మొట్టమొదటి వ్యవస్థాపక కార్యదర్శి, విశాఖ పోర్ట్ ట్రస్ట్ ట్రేడ్ యునియన్. శ్రీమతి అత్తలూరి అనసూయ దంపతులకు లో తెనాలి లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా  అదే ఏడాది నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్స్వవం రోజు తల్లి, తండ్రులు హైదరాబాద్ వచ్చి స్థిరపడడంతో హైదరాబాద్ లోనే వీరి ప్రస్థానం కొనసాగింది.. విద్యాభ్యాసం, ఉద్యోగం అంతా హైదరాబాద్లోనే.

వృత్తి: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంలో అధికార హోదాలో పదవీ విరమణ

ప్రవృత్తి: రచనా వ్యాసంగం ..తల్లి, తండ్రుల నుంచి వారసత్వంగా సాహితీ పరిమళం వీరిని సోకింది. తత్ ఫలితంగా పద్దేనిమిదవ ఏట నుంచే రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు. వీరి సాహితీ ప్రస్థానం ఈ విధంగా సాగింది.

కథా రచయిత్రిగా ...       

(1975 లో)  ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రానికి చందమామ అనే స్కెచ్ ద్వారా తొలి అడుగు.  1984 వరకూ అనేక కథలు  శకునాలు, ఆడపిల్ల, పయనం, పరిష్కారం, వానపాము కాటేసింది, సౌదామిని, ఇదీ జీవితం సుమారు వంద పైన ప్రసారం అయాయి.

రేడియో నాటక రచయిత్రిగా

 • సుమారు రెండువందల పైన నాటకాలు ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారం అయాయి
 • యవనిక,  అంతర్మథనం, మ్యాచ్ ఫిక్సింగ్  (నాటకాల సంపుటిలు)
 • రంగస్థల నాటక రచయిత్రిగా
 • సరసిజ  వుమెన్ థియేటర్ వ్యవస్థాపన 2013 లో
 • ఉత్తరం    (రసరంజని నాటక రచన పోటిలో బహుమతి పొందిన నాటకం)
 • స్పర్శ    (అమెరికా తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించిన నాటక రచనల పోటిలో ప్రథమ బహుమతి పొందిన నాటకం)
 • అంతర్మథనం
 • మ్యాచ్ ఫిక్సింగ్
 • రంగస్థలం
 • మేమూ మనుషులమే
 • హైటెక్ కాపురం (మమ  కారాల కాపురం పేరుతొ అమెరికాలో ప్రదర్శన సరసిజ థియేటర్ ద్వారా)
 • మిస్సమ్మ  ( విజయ వారి మిస్సమ్మ సినిమా రంగస్థల నాటకంగా సరసిజ థియేటర్ ద్వారా అమెరికాలో ప్రదర్శన)
 • అనగనగా ఓ రాజకుమారి  (భేతాళ కథ ఆధారంగా రాసిన జానపద నాటకం అమెరికాలో ప్రదర్శన)

టివి సీరియల్:

 • కాంతి రేఖ
 • నివేదిత
 • పల్లకిలో పల్లవి

టెలి ఫిలిమ్స్:

 • బలి
 • ఈ దారి ఎక్కడికి?
 • ఈ చరిత్ర ఎవరు రాశారు?
 • ఇంకా అనేకం
 • కాలమిస్టు గా
 • లోకం తీరు
 • “ఈ” కాలం                 
 • యువతరం
 • శుభాశీస్సులు
 • వాక్ టాక్
 • రిలేషన్ షిప్ ...

రచనలు

 1. అపురూప కథలు (కథా సంపుటం)
 2. అపూర్వ కథలు (కథా సంపుటం)
 3. ఆనాటి చెలిమి ఒక కల! (కథా సంపుటం)
 4. ఒప్పందం (కథా సంపుటం)
 5. దత్తపుత్రుడు (నవల)
 6. గూడు చెదిరిన గువ్వలు (నవల)
 7. ప్రతిమాదేవి (నవల)
 8. తెల్ల గులాబీ.. (నవల)
 9. అర్చన (నవల)
 10. మహావృక్షం (నవల)
 11. అంతర్మథనం (నాటికల సంపుటి)
 12. యవనిక (నాటికల సంపుటి)
 13. నీహారిక (నాటకం)

నవలా రచయిత్రిగా

 1. దత్తపుత్రుడు
 2. మహావృక్షం
 3. నేనెవరిని?
 4. అమావాస్యతార
 5. ప్రతిమాదేవి
 6. గూడు చెదిరిన గువ్వలు
 7. తెల్లగులాబి
 8. అతిధి
 9. ఆ గదిలో
 10. అర్చన
 11. నటి
 12. రాగం తీసే కోయిల
 13. కడలి
 14. బొమ్మ
 15. పేరైనా అడగలేదు
 16. శ్రీకారం
 17. ప్రేమిస్తే ఏమవుతుంది?
 18. ఏ పుట్టలో ఏమున్నదో
 19. హిమజ్వాల

పురస్కారాలు[మార్చు]

 1. నార్ల వెంకటేశ్వరరావు పురస్కారం
 2. విశిష్టమహిళ పురస్కారం
 3. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక వారి సన్మానం
 4. యునిసెఫ్ అంతర్జాతీయ పురస్కారం
 5. ఆకాశవాణి నాటకానికి  కేంద్ర ప్రభుత్వ పురస్కారం
 6. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ  కీర్తి పురస్కారం
 7. కొలకలూరి ఇనాక్ ఉత్తమ నాటక రచయిత్రి పురస్కారం
 8. జ్యేష్ట లిటరరీ  సాహిత్య పురస్కారం
 9. “నార్ల” విశిష్ట రచయిత్రి పురస్కారం
 10. అబ్బూరి రుక్మిణమ్మ స్మారక పురస్కారం
 11. బాదం సరోజాదేవి స్మారక పురస్కారం
 12. జ్యోత్స్న కళా పీఠం ఉత్తమ రచయిత్రి పురస్కారం
 13. అమృతలత  “అపరూప” ఉత్తమ నాటక రచయిత్రి పురస్కారం
 14. కమలాకర ట్రస్ట్ ఉత్తమ రచయిత్రి పురస్కారం
 15. ఉత్తమ నాటక రచయిత్రిగా తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారం-2015[1][2]

మూలాలు[మార్చు]

 1. "తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు వీరికే". Sakshi. 2017-03-09. Archived from the original on 2017-08-21. Retrieved 2022-09-15.
 2. "39మందికి తెలుగు వర్శిటీ కీర్తి పురస్కారాలు". andhrabhoomi.net. Archived from the original on 2017-03-13. Retrieved 2022-09-15.