Jump to content

తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2015)

వికీపీడియా నుండి
కీర్తి పురస్కారాలు (2015)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు
వ్యవస్థాపిత 1986
మొదటి బహూకరణ 1986
క్రితం బహూకరణ 2014
మొత్తం బహూకరణలు 39
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 5,116
Award Rank
2014కీర్తి పురస్కారాలు (2015)2016

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు. [1]

1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.

పురస్కార గ్రహీతలు

[మార్చు]

2015 సంవత్సర కీర్తి పురస్కారానికి 39 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[2][3]

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 దేవులపల్లి కృష్ణమోహన్‌ సృజనాత్మక సాహిత్యం బెజవాడ పట్టాభిరామిరెడ్డి డా. బెజవాడ గోపాలరెడ్డి
2 సయ్యద్‌ నసీర్‌ అహ్మద్‌ పరిశోధన తిక్కవరపు రామిరెడ్డి డా. బెజవాడ గోపాలరెడ్డి
3 పులిగడ్డ విశ్వనాథరావు హాస్యరచన బులుసు బుచ్చి సర్వారాయడు ఎస్.బి.బి. పట్టాభిరామారావు
4 హైమావతి భీమన్న జీవిత చరిత్ర ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు
5 జ్వలిత ఉత్తమ రచయిత్రి నాళం కృష్ణారావు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
5 హెచ్‌.కె. వందన ఉత్తమ నటి పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
7 సత్కళా భారతి సత్యనారాయణ ఉత్తమ నటుడు పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
8 అత్తలూరి విజయలక్ష్మి ఉత్తమ నాటక రచయిత పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
9 భూపతి నారాయణమూర్తి హేతువాదం త్రిపురనేని రామస్వామి కోటపాటి మురహరిరావు
10 తంగెళ్ళ శ్రీదేవి ఉత్తమ రచయిత్రి వాసిరెడ్డి రంగనాయకమ్మ వాసిరెడ్డి సీతాదేవి
11 దాసరాజు రామారావు వచన కవిత ఎ. లక్ష్మీరమణ అమిలినేని లక్ష్మీరమణ
12 నోముల సత్యనారాయణ వివిధ ప్రక్రియలు ఏటుకూరి వెంకట నర్సయ్య డా. యస్.యస్. కృష్ణమూర్తి
13 తెలకపల్లి రవి పత్రికారచన తాపీ ధర్మారావు కోటపాటి మురహరిరావు
14 చెంచు సుబ్బయ్య అవధానం కార్యమపూడి రాజమన్నారు కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు
15 సుమిత్ర అంకురం మహిళాభ్యుధయం మల్లాది సుబ్బమ్మ మల్లాది సుబ్బమ్మ
16 ఆచార్య రామారెడ్డి గ్రంథాలయ కర్త అయ్యంకి వెంకటరమణయ్య డా. వెలగా వెంకటప్పయ్య
17 ఆచార్య చంద్రశేఖరరావు గ్రంథాలయ సమాచార విజ్ఞానం పర్వతనేని గంగాధరరావు డా. వెలగా వెంకటప్పయ్య
18 విహారి కథ బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం బుర్రా అలిమేలు
19 గంగోత్రి సాయి నాటకం బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం బుర్రా అలిమేలు
20 వి. రమణి ఆంధ్రనాట్యం డా. నటరాజ రామకృష్ణ డా. నటరాజ రామకృష్ణ
21 జాతశ్రీ నవల బి. అరుణ కుమారి ఆచార్య వి. రామకృష్ణారావు
22 ఆచార్య బి. రామకృష్ణారెడ్డి భాష అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు అబ్బూరి ట్రస్ట్
23 శింగారపు ఓదెయ్య జానపద కళలు సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
24 బూర్గుల శ్రీనాథ శర్మ ఆధ్యాత్మిక సాహిత్యం బాదం సరోజదేవి బాదం రామస్వామి
25 పల్లేరు వీరాస్వామి సాహిత్య విమర్శ పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం ఆచార్య పి. లీల
26 వెలుదండ సత్యనారాయణ పద్యం నండూరి రామకృష్ణమాచార్య నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం
27 పద్మ మోహన్‌ యాదగిరి సాంస్కృతిక సంస్థ నిర్వహణ వంగా లక్ష్మణరెడ్డి వి.వి. రాఘవరెడ్డి
28 పి.వి. అరుణాచలం జనరంజక విజ్ఞానం నాగసూరి సంజీవయ్య నాగసూరి వేణుగోపాల్
29 సి. నాగేశ్వరరావు జానపద గాయకులు బుర్రా రాజసోమిదేవి పి. రాజ్యలక్ష్మీ
30 వి.ఆర్‌. శర్మ బాల సాహిత్యం అంగలకుదిటి సుదంరాచార్య కందేపి రాణిప్రసాద్
31 విశ్వనాథ్‌ జోషి ఇంద్రజాలం డా. బి.వి.పట్టాభిరామ్ బి.వి.పట్టాభిరామ్
32 జి. యాదగిరి పద్య రచన కె.వి. రమణాచారి డా. కె.వి. రమణాచారి
33 పాప కార్టూనిస్ట్ జి. అమృతలత జి. అమృతలత
34 ఎ. శారదారెడ్డి లలిత సంగీతం జి. రాజారెడ్డి జి. రాజారెడ్డి
35 డాక్టర్‌ సజ్జాద్‌ వయోజన విద్య, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం
36 రేవతి రత్నస్వామి శాస్త్రీయ సంగీతం డా. రావూరి భరద్వాజ కాంతమ్మ డా. రావూరి భరద్వాజ
37 ఆచార్య సివిబి. సుబ్రహ్మణ్యం జ్యోతిషం
38 నిడమర్తి నిర్మలాదేవి కాల్పనిక సాహిత్యం
39 దాశరథుల బాలయ్య తెలుగు గజల్‌

మూలాలు

[మార్చు]
  1. నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". www.navatelangana.com. Retrieved 2022-09-15.
  2. "తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు వీరికే". Sakshi. 2017-03-09. Archived from the original on 2017-08-21. Retrieved 2022-09-15.
  3. "39మందికి తెలుగు వర్శిటీ కీర్తి పురస్కారాలు". andhrabhoomi.net. Archived from the original on 2017-03-13. Retrieved 2022-09-15.