అత్తిలి సూర్యనారాయణ
Jump to navigation
Jump to search
అత్తిలి సూర్యనారాయణ | |
---|---|
జననం | అత్తిలి సూర్యనారాయణ |
వృత్తి | సహాయ అధ్యాపకుడు |
ఉద్యోగం | పిఠాపురం రాజా కళాశాల, కాకినాడ |
ప్రసిద్ధి | సంఘ సంస్కర్త, రచయిత |
అత్తిలి సూర్యనారాయణ రచయిత, సంఘ సంస్కర్త. ఇతడు ఆర్యసమాజంలో పనిచేశాడు. 1914లో రాయుడు గంగయ్య, వెల్లంకి కృష్ణమూర్తిలతో కలిసి ఏలూరు, ఆ చుట్టుపక్కల గ్రామాలైన గోగులపల్లి, పైడిచింతలపాడు గ్రామాలలో క్రైస్తవ మతం మార్చుకున్న వందలాది అంటరాని వారిని తిరిగి హిందువులుగా మతమార్పిడి చేయించాడు.[1] అస్పృశ్యులకు ఏలూరులోని జనార్దనస్వామి ఆలయ ప్రవేశానికై ఆత్మకూరు గోవిందాచార్యులు, గూడూరు రామచంద్రరావు, చెంచుదాసు, అయ్యదేవర కాళేశ్వరరావు, నరాలసెట్టి దేవేంద్రుడు మొదలైన వారితో కలిసి సత్యాగ్రహాన్ని నిర్వహించాడు.[2] ఇతడు కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాలలో సహాయోధ్యాపకుడిగా పనిచేసినాడు.[3]
రచనలు
[మార్చు]- కబీరు
- హిందూ దేశ దారిద్ర్యం[4]
- దేవేంద్రనాథ చరిత్రము
- ఏమిటీ మాయ
- పురాణ మణిమంజరి (సర్వారాయుడు శృంగారకవి తో కలిసి)
మూలాలు
[మార్చు]- ↑ జంగం చిన్నయ్య, అనువాదం:కె.సజయ. ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు (2021 ed.). హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ట్రస్ట్. p. 174. Retrieved 18 June 2022.
- ↑ జంగం చిన్నయ్య, అనువాదం:కె.సజయ. ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు (2021 ed.). హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ట్రస్ట్. p. 157. Retrieved 18 June 2022.
- ↑ కాశీనాథుని నాగేశ్వరరావు (12 April 2011). "చిత్రపటముల వివరణము" (PDF). ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 253. Retrieved 18 June 2022.
- ↑ Prabhāvati, Vāsā (2003). Bhāratasvātantryōdyamaṃlō Telugu mahiḷala pātra. Vāsā Pracuraṇalu.