సర్వారాయుడు శృంగారకవి
Jump to navigation
Jump to search
సర్వారాయుడు శృంగారకవి | |
---|---|
జననం | సర్వారాయుడు విస్సాప్పగడ 1864 |
మరణం | మార్చి 13, 1939 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నాటకకర్త, పండితుడు |
తల్లిదండ్రులు | పల్లంరాజు, తిలరామాంబ |
సర్వారాయుడు శృంగారకవి (1864 - మార్చి 13, 1939) ప్రముఖ నాటకకర్త, పండితుడు.[1][2]
జననం
[మార్చు]సర్వారాయుడు 1864లో పల్లంరాజు, తిలరామాంబ దంపతులకు ఇంజరంలో జన్మించాడు. ఈయన ఇంటిపేరు విస్సాప్పగడ. ఈయన పూర్వీకుడైన వెంకయ్య శృంగార పద్యాలు చెప్పడంవల్ల శృంగారకవి ఇంటిపేరుగా మారింది.
విద్యాభ్యాసం - ఉద్యోగం
[మార్చు]సర్వారాయుడు తన తండ్రి దగ్గర సంస్కృతం, ఆంధ్రం చదువుకున్నాడు. 1880 నుండి నరసాపురం, కిర్లంపూడి, రాజమండ్రి, పెద్దాపురం మొదలైన ప్రాంతాలలోని ఆంగ్ల పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. 1894 నుండి 1929 వరకు కాకినాడ లోని పిఠాపురం రాజా వారి కళాశాలలో పనిచేశాడు.
రచనాప్రస్థానం
[మార్చు]దాదాపు 71 కావ్యాలు రచించిన సర్వారాయుడు ఎక్కువగా పిల్లల పుస్తకాలు, స్త్రోత్రాలు రచించాడు. స్త్రీ నీతి దర్పణము (1898) రచించాడు.
నాటకాలు
[మార్చు]- ప్రతాపరుద్రీయం (1906)
- నాటక లక్షణం (1907) - గ్రంథం)
- సావిత్రి (1911)
- స్నుషా విజయం
- వినాయక విజయం
- సివిక్స్ డ్రామాలు (1912)[3]
- ప్రహసనమాల
మరణం
[మార్చు]సర్వారాయుడు 1939, మార్చి 13న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.631.
- ↑ ప్రజాశక్తి, స్నేహ (31 December 2016). "చిరు మనసుల నాటికలు". Archived from the original on 1 జనవరి 2017. Retrieved 30 January 2018.
- ↑ ఆనంద్ బుక్స్. "Civics Dramalu - సివిక్సు డ్రామాలు". www.anandbooks.com. Retrieved 30 January 2018.[permanent dead link]