అద్దంకివారిపాలెం
స్వరూపం
"అద్దంకివారిపాలెం" బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
అద్దంకివారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°02′13″N 80°44′14″E / 16.036982°N 80.737297°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | నగరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522262 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
[మార్చు]- ఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 2013-14వ సంవత్సరంలో, 10 వ తరగతి చదివిన 24 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై, 100% ఉత్తీర్ణత సాధించారు. [2]
- ఈ పాఠశాలకు, గ్రామస్థులు స్వయంగా పక్కా భవనసముదాయం ఏర్పాటు చేసుకున్నారు. పాఠశాలకు కావలసిన మౌలిక వసతులను, గ్రామంలోని విద్యావంతులు, ధనవంతులు తమవంతు సాయంగా అందజేసినారు. గ్రామములోని పూర్వవిద్యార్థులు, పాఠశాల అభివృద్ధికై ఒక కమిటీగా ఏర్పడి, కృషిచేస్తున్నారు. [3]
గ్రామములో మౌలిక సదుపాయాలు
[మార్చు]రహదారులు
[మార్చు]గ్రామంలో రెండున్నర కోట్ల రూపాయలతో గ్రామస్థులే స్వయంగా అంతర్గత రహదారులను అభివృద్ధి చేసుకున్నారు.
రక్షిత మంచినీటి పథకాలు
[మార్చు]ఈ గ్రామంతోపాటు శివారు గ్రామాలైన వీరంకివారిపాలెం, ఉయ్యూరివారిపాలెం, బందులవారి పాలెం గ్రామాలకు గూడా రక్షిత త్రాగునీటి పథ్సకాలను ఏర్పాటుచేసుకున్నారు. [3]
గ్రామ పంచాయతీ
[మార్చు]- కొండవీటివారి పాలెం గ్రామం, అద్దంకివారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
- ఈ గ్రామం జిల్లాలో ఆదర్శగ్రామంగా నిలిచింది. 2000, 2005, 2013 లలో శ్రెమతి విచారపు పావని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయినారు. ఈమె హయాంలో రహదారులు, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలిపినారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ తాళమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక ఉత్సవాలు, నవంబరు/2015 లో సంప్రదాయ పద్ధతులలో, ఘనంగా నిర్వహించారు. ముగింపు రోజున అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. విచ్చేసిన భక్తులకు మద్యాహ్నం అన్నసమారధన నిర్వహించారు.