అనితా దాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనితా దాస్
జననం(1953-10-01)1953 అక్టోబరు 1
మరణం2018 మే 11(2018-05-11) (వయసు 64)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1975–2017
బంధువులుఆకాష్ దస్నాయక్ (మేనల్లుడు)

అనితా దాస్ (1953 అక్టోబరు 1 - 2018 మే 11) ఒడియా టెలివిజన్, సినిమా నటి.[1] తన సినీ జీవితంలో మూడు ఒడిశా రాష్ట్ర సినిమా అవార్డులను అందుకుంది. తన 64 సంవత్సరాల వయస్సులో 2018 మే 11న గుండెపోటుతో మరణించింది.[2]

సినిమారంగం[మార్చు]

1975లో వచ్చిన జజబారా అనే ఒరియా సినిమాలో అనితా దాస్ ప్రధాన పాత్రలో నటించింది. దాదపు వందకు పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించింది, ఎక్కువగా తల్లిగా సహాయ పాత్రల్లో నటించింది. 1980ల తర్వాత చాలా సినిమాల్లో తల్లి పాత్రలో నటించి బాగా గుర్తింపు పొందింది. [3]

అవార్డులు[మార్చు]

  • 1980లో తపస్య సినిమాలో నటనకు ఉత్తమ నటిగా ఒడిశా రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
  • 1983లో భక్త సలాబేగ్ సినిమాలో నటనకు ఉత్తమ నటిగా ఒడిశా రాష్ట్ర చలనచిత్ర పురస్కారం[4]
  • 1987లో ఈయ తా దునియా సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటిగా ఒడిశా రాష్ట్ర చలనచిత్ర పురస్కారం

మరణం[మార్చు]

2018 మే 10న ఆరోగ్యానికి గురైంది.[5] ఆరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఆమెకు వాంతులు, గుండె, ఛాతిలో నొప్పులు వచ్చాయి. మరుసటి రోజు 2018 మే 11న మరణించింది.[6]

మూలాలు[మార్చు]

  1. "Anita Das - lifetime actress in Odia cinema". Retrieved 2022-05-07.
  2. "Odia actress Anita Das passes away". The Hindu. 12 May 2018. ISSN 0971-751X. Retrieved 2022-05-07.
  3. IANS. "Veteran Indian actress Anita Das passes away at 57". m.khaleejtimes.com. Retrieved 2022-05-07.
  4. "Anita Das". IMDb (in ఇంగ్లీష్). Retrieved 2022-05-07.
  5. "Veteran Odia film actress Anita Das no more - PRAGATIVADI:LEADING ODIA DAILY". pragativadi.com. Archived from the original on 2019-04-26. Retrieved 2022-05-07.
  6. "Veteran actor Anita Das passes away". The New Indian Express. Retrieved 2022-05-07.

బయటి లింకులు[మార్చు]