అనుపమ గౌడ
అనుపమ గౌడ | |
---|---|
జననం | 1991 మార్చి 20 |
జాతీయత | భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2003 - ప్రస్తుతం |
అనుపమ గౌడ, కన్నడ సినిమా, టివి నటి.
జననం
[మార్చు]అనుపమ 1991, మార్చి 21న కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది.
కళారంగం
[మార్చు]అనుపమ గౌడ 2003లో వచ్చిన లంకేష్ పత్రిక సినిమాలో బాలనటిగా తన సినిమా కెరీర్‌ని ప్రారంభించింది.[1] 2015లో వచ్చిన నగరి సినిమాలో ప్రధాన పాత్రను పోషించడానిముందు హల్లి దునియా అనే రియాలిటీ షోతో టెలివిజన్‌లోకి ప్రవేశించింది.[2] 2017 చివరలో, బిగ్ బాస్ కన్నడ ఐదవ సీజన్‌లో పాల్గొన్న తర్వాత అనుపమకి గుర్తింపు వచ్చింది.[2] కన్నడ కోగిలే టెలివిజన్ షోతో యాంకర్‌గా అరంగేట్రం చేసింది.[3] అక్క టెలివిజన్ ధారావాహికలో ద్విపాత్రాభినయం చేయడానికి ముందు చి.సౌ. సావిత్రి సీరియల్ లో నటించింది.[4] 2018లో, కార్తీక్ జయరామ్‌తో కలిసి ఆ కరాల రాత్రి చిత్రంలో నటించి, నటనకు ప్రశంసలు అందుకుంది.[5] రాఘవేంద్ర రాజ్‌కుమార్, ఆర్జే రోహిత్ నటించిన త్రయంబకం (2019) సినిమాలో జర్నలిస్టు పాత్రలో నటించింది.[6] నటుడు విజయ్ రాఘవేంద్రతో కలిసి 8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కోసం కన్నడ భాషా అవార్డులను హోస్ట్ గా చేసింది.[2]మజా భారత్‌కి యాంకర్‌గా కూడా పనిచేసింది.[7]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2003 | లంకేష్ పత్రికే | బాలనటి | |
2015 | నగరి | ||
2018 | ఆ కరాళ రాత్రి | మల్లిక | |
2019 | త్రయంబకం | నమన | |
2020 | బెంకియల్లి అరలిద హూవు | సుకన్య |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
హల్లీ దునియా | |||
2010-2019 | చి.సౌ. సావిత్రి | ||
2014-2017 | అక్కా | దేవిక, భూమిక | ద్విపాత్రాభినయం |
2017-2018 | బిగ్ బాస్ కన్నడ | పోటీదారు | 98వ రోజున ఎలిమినేట్ |
2017 | మజా భరత | యాంకర్ | |
2021 | రాజా రాణి | యాంకర్ | |
2021-2022 | నాన్నమ్మ సూపర్ స్టార్ | యాంకర్ |
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]సంవత్సరం | అవార్డు | వర్గం | సినిమా | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
2019 | 8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ తొలి కన్నడ నటి | ఆ కరాళ రాత్రి | గెలుపు | [8] |
మూలాలు
[మార్చు]- ↑ "Anupama Gowda: I look up to Deepika Padukone and Alia Bhatt - Times of India". The Times of India.
- ↑ 2.0 2.1 2.2 Yerasala, Ikyatha (August 21, 2019). "No limits for this SIIMA award winner!". Deccan Chronicle.
- ↑ "Anupama Gowda: Anchoring is my job; acting is my passion - Times of India". The Times of India.
- ↑ SM, Shashiprasad (June 28, 2018). "AKka girl's got a filmi agenda". Deccan Chronicle.
- ↑ "You can't categorise my role in Aa Karaala Ratri: Anupama Gowda - Times of India". The Times of India.
- ↑ "Anupama Gowda to play a journalist in 'Thriyambakam' - Times of India". The Times of India.
- ↑ "I've quit anchoring as it was affecting my career as an actor: Anupama Gowda - Times of India". The Times of India.
- ↑ "SIIMA Awards 2019: Vijay, Yash, Keerthi, KGF win big, here's full winners list". Deccan Chronicle. August 16, 2019.