అనుపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనుపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
అనుపాలెం is located in Andhra Pradesh
అనుపాలెం
అనుపాలెం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°28′05″N 79°57′14″E / 16.468000°N 79.953889°E / 16.468000; 79.953889
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం రాజుపాలెం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522615
ఎస్.టి.డి కోడ్

అనుపాలెం పల్నాడు జిల్లా, రాజుపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం:- అనుపాలెం గ్రామ గుట్టపై ఉన్న ఈ ఆలయంలో, అమ్మవారికొలువులు 2014, ఆగస్టు-27, బుధవారం నాడు ఘనంగా నిర్వహించారు. వానలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థిచారు. గ్రామ మహిళలందరూ ఊరేగింపుగా తరలివెళ్ళి, అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

గ్రామ విశేషాలు[మార్చు]

  1. కుమారి వీర్ల నాగపద్మ:- ఈ గ్రామానికి చెందిన వీర్ల శ్రీను, ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వారు. భార్యాభర్తలిద్దరూ కూలీనాలీ పనిచేసి కుటుంబన్ని పోషించుచున్నారు. వీరు తమ కుమార్తె నాగపద్మను కష్టపడి చదివించుచున్నారు. నాగపద్మను పదవ తరగతి వరకు, స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోనే చదివించారు. ఈమె పదవ తరగతిలో మండలంలోనే ప్రథమ స్థానంలో ఉత్తీర్ణురాలయి, ట్రిబుల్ ఐ.టి. నూజివీడులో సీటు సాధించింది. అక్కడే ఇంటరు పరీక్షలు వ్రాసిన ఈమె, 2014, మే-14న అమెరికాలోని "నాసా" అంతరిక్ష పరిశోధనా కేంద్రం వారి అహ్వానం మేరకు అక్కడ ఒక సదస్సుకు హాజరైనది. ఆ సదస్సులో మొత్తం 400 మంది వివిధ దేశాలకు చెందినవారు హాజరైనారు. ఆ సదస్సులో ఈమె, తను రూపొందించిన ఏరోనాటికల్ ప్రాజెక్టులో క్రియేటివ్ అనదర్ వరల్డ్ "నిత్య" అను ప్రాజక్టును వివరించింది. భవిష్యత్తులో భూమి నాశనమైతే, ప్రజలు ఎక్కడ ఉండాలనే దానిపై ప్రత్యామ్నాయం 'స్పేస్' ను తన ప్రాజెక్టులో చూపించింది. ఈ ప్రాజెక్టుకు అక్కడి సీనియర్ సైంటిస్ట్ శ్రీ ఆల్ గ్లోబస్ మెచ్చుకొని అభినందించారు. ఈ సందర్భంగా నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ వారు ఈమెకు ఒక ధ్రువపత్రం అందజేసినారు. ఈమె ఈ సదస్సుకు హాజరవడానికి ఒక లక్ష రూపాయలను జిల్లా పాలనాధికారి సురేష్ కుమార్, చొరవ తీసుకొని జిల్లా పరిషత్తు సాధారణ నిధులనుండి, జిల్లా పరిషత్తు సి.ఏ.ఓ. సుబ్బారావుతో మంజూరు చేయించారు. ఇంకా మరికొందరు దాతలు గూడా ఆర్థిక సహాయం చేసారు.[1]
  2. మద్దెల పునీత్ కుమార్, బాక్సింగ్ వీరుడు:-ఇతని తండ్రి నాగరంగారావు, సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందారు. తల్లి విజయలక్ష్ము పిడుగురాళ్ళలోని ఒక పాఠశాలలో పి.యి.టి.గా పనిచేస్తుంది. దాసరి వెంకటరావు, సైన్యంలో సుదీర్ఘకాలం పనిచేసాడు.ఇతను జాతీయస్థాయిలో, బాక్సింగు క్రీడలో, పలుమార్లు బంగారు పతకాలు సాధించాడు. పునీత్ కుమార్ కు చిన్నప్పటినుండి ఆటలు అంటే మక్కువ. పాఠశాల స్థాయిలో పలుక్రీడలలో ప్రతిభ కనబరచాడు. తాతయ్య స్ఫూర్తితో ఇతను బాక్సింగ్ రంగంలో దిగి, తాతయ్య దగ్గర ఓనమాలు నేర్చుకొని, స్థానికంగా శిక్షణపొంది, అందివచ్చిన అవకాశాలను వినియోగించుకొని, రాష్ట్ర, పలు పోటీలలో తన ప్రతిభ ప్రదర్శించాడు. ఇతను రాష్ట్ర, జాతీయ స్థాయిలలో మూడు బంగారు పతకాలనూ. రెండు కాంస్య పతకాలనూ సాధించి, భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీలలో పాల్గొని, తద్వారా ఒలింపిక్స్లో పోటీపడాలని ఉవ్విళ్ళూరుచున్నాడు.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు గుంటూరు సిటీ; 2014,మే-29;2వ పేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=అనుపాలెం&oldid=3649349" నుండి వెలికితీశారు