Jump to content

అనూషా రంగనాథ్

వికీపీడియా నుండి
అనూషా రంగనాథ్
జననం (1991-03-14) 1991 మార్చి 14 (వయసు 33)
ఇతర పేర్లుఆషిక
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • ఎన్. రంగనాథ్ (తండ్రి)
  • సుధా రంగనాథ్ (తల్లి)
బంధువులుఆషికా రంగనాథ్

అనూషా రంగనాథ్ (జననం 1991 మార్చి 14) భారతీయ కన్నడ ప్రముఖ నటి. 2016లో చిత్రసీమలోకి అరంగేట్రం చేసిన ఆమె 2019లో వచ్చిన అందవాడా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

అనూషా రంగనాథ్ 1991 మార్చి 14న కర్ణాటకలోని తుమకూరులో జన్మించింది. ఆమె తండ్రి ఎన్. రంగనాథ్ లెక్చరర్ కాగా, తల్లి సుధా రంగనాథ్ గృహిణి. ఆమె చెల్లెలు ఆషికా రంగనాథ్ కూడా కన్నడ చిత్ర పరిశ్రమలో బాగా ప్రాచుర్యం పొందింది. అనూష పాఠశాల విద్య తుమకూరులోని బిషప్ సర్గాంట్ పాఠశాలలో కొనసాగింది. ఆ తరవాత ఆమె బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి తన డిగ్రీని పూర్తిచేసింది. తను చిన్నప్పటి నుంచి కో-కరిక్యులర్ యాక్టివిటీస్ పై మక్కువతో నటన, నాట్యం, పాడటం వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి చూపించేది. వాటిమీద ఉన్న దృష్టితో చదువుపై తక్కువ సమయం కేటాయించింది. వినోద పరిశ్రమలోకి ఎలాగైనా అడుగుపెట్టాలన్న తన కోరికను నెరవేర్చుకుంది.

కెరీర్

[మార్చు]

అనూషా రంగనాథ్ 2016లో వచ్చిన సోడాబుడ్డి అనే రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంతో అరంగేట్రం చేసింది, ఆ తరువాత కూడా ఆమె 2017లో లైఫ్ 360 అనే రొమాంటిక్ మూవీనే చేసింది. 2019లో అందవాడా చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన అనూషా రంగనాథ్ 2022లో వినయ్ రాజ్‌కుమార్ సరసన 10లో నటించింది.