Jump to content

అన్వర్

వికీపీడియా నుండి
(అన్వర్ పాష మహ్మద్‌ నుండి దారిమార్పు చెందింది)
అన్వర్
అన్వర్
జననంమహ్మద్ అన్వర్ పాషా
(1968-06-02) 1968 జూన్ 2 (వయసు 56)
India శివనగర్, వరంగల్ , తెలంగాణ రాష్ట్రం
వృత్తిఆరోగ్య విస్తరణాధికారి
ప్రసిద్ధికవి, రచయిత, సామాజిక సేవకులు
మతంఇస్లాం
తండ్రిజానీమియా
తల్లికరీంబీ

వరంగల్ పట్టణంలోని శివనగర్‌ ప్రాంతానికి చెందిన అన్వర్ 1968 జూన్ 2న కరీంబీ, జానీమియా దంపతులకు జన్మించాడు. బి.ఎస్సీ., బి.ఏ., ఎం.ఏ.(తెలుగు),ఎం.ఏ.(సోషియాలజీ) అభ్యసించాడు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో విస్తరణాధికారిగా పనిచేస్తున్నాడు. కవిగా, రచయితగా పేరు గడించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు. ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతున్నాడు. తెలంగాణా అమరవీరుడు షేక్ ఫకీర్ పేరు మీద ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించాడు.

సాహతీ ప్రస్థానం

[మార్చు]

1990లో సాహిత్యరంగ ప్రవేశం చేసాడు. ఇతని కవితలు, కథలు, వ్యాసాలు వివిధ పత్రికలో ప్రచురింపబడ్డాయి. పుస్తకాలుగా వెలువడ్డాయి.

కవిత్వం శరీరంలో రక్తనిష్టగా ప్రవహించాలన్న ఆశయంతో, జీవిత మూలాలకు సంబంధించిన విషయాల్ని కవిత్వీకరించడం, ముస్లింల జీవన, సామాజిక, ఆర్థిక, సాంఫిుక విషయాల వ్యక్తీకరించడం అన్వర్ లక్ష్యం.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 2021, ఏప్రిల్ 3న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన ఆజాది కా కవి సమ్మేళన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. మామిడి హరికృష్ణ చేత సత్కారం అందుకుంటున్న అన్వర్

రచించిన పుస్తకాలు

[మార్చు]
  1. తలవంచని అరణ్యం(1999)
  2. ముఠ్ఠీ(2007)
  3. 1969 వరంగల్ అమరవీరులు
  4. ఆజాం (గుజరాత్ కవిత్వం)- సంపాదకత్వం
  5. తెలంగాణా కవిత - సంపాదకత్వం
  6. నాయిన - సంపాదకత్వం
  7. సలామ్‌
  8. 2009 తెలంగాణా అమరులు
  9. బక్రీ (కథలు)- 2015
  10. జమీలాబాయి(నవల)- 2017
  11. ఖుల్లమ్ ఖుల్లా - 2019

అందుకున్న పురస్కారాలు

[మార్చు]
  • 2000లో తలవంచని అరణ్యం కవిత్వానికి ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు
  • ఎక్స్‌రే అవార్డు రెండుసార్లు
  • వరంగల్ జిల్లా యువకవి
  • వరంగల్ జిల్లా ఉత్తమకవి - నాలుగు పర్యాయాలు
  • డా.ద్వా.నా.శాస్త్రి విశిష్ట అవార్డు
  • భారతీయ దళిత సాహిత్య అకాడెమీ అవార్డు
  • డా.అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అన్వర్&oldid=4354735" నుండి వెలికితీశారు