Jump to content

అబే కురువిళా

వికీపీడియా నుండి
అబే కురువిళా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1968-08-04) 1968 ఆగస్టు 4 (వయసు 56)
మన్నార్, అలప్పుజా, కేరళ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 10 25
చేసిన పరుగులు 66 26
బ్యాటింగు సగటు 6.60 3.71
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 35* 7
వేసిన బంతులు 1,765 1,131
వికెట్లు 25 25
బౌలింగు సగటు 35.68 35.60
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/68 4/43
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 4/–
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 4

అబే కురువిళా (జననం 1968 ఆగస్టు 4) భారతీయ మాజీ క్రికెటరు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) జనరల్ మేనేజరు. అతను 1990ల మధ్యలో భారత క్రికెట్ జట్టులో బౌలర్‌గా ఆడాడు. అతను బీసీసీఐకి సెలక్టర్‌గా ఉన్నాడు. [1]

కురువిళా ఆరడుగుల ఆరంగుళాల ఎత్తుకు ప్రసిద్ది చెందాడు.[2] అతను ముంబైలోని చెంబూర్‌లో పెరిగాడు. 2000లో అన్ని రకాల క్రికెట్ నుండి రిటైరై, కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు.

అంతర్జాతీయ కెరీర్‌లో కురువిళా, పది టెస్టులు, ఇరవై ఐదు వన్డే ఇంటర్నేషనల్‌లలో ఆడాడు. అవన్నీ ఒకే క్యాలెండర్ సంవత్సరంలో ఆడాడు. [3]

కెరీర్

[మార్చు]

1997లో వెస్టిండీస్ పర్యటనలో జవగల్ శ్రీనాథ్ రోటేటర్ కఫ్ గాయంతో దూరమైనప్పుడు కురువిళా పేస్ బౌలింగుకు నాయకత్వం వహించాడు. ఆ పర్యటనలో అతని గణాంకాలు పరవాలేదుగా ఉన్నప్పటికీ, తదుపరి టెస్ట్ మ్యాచ్‌లలో చదునైన పిచ్‌లపై కూడా ఒక మాదిరి బాగానే బౌలింగ్ చేసినప్పటికీ, అతన్ని జట్టు నుండి తొలగించారు. 2000 ఏప్రిల్‌లో రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్ సమయంలో 31 సంవత్సరాల వయస్సులో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. "ఈ సీజన్ ప్రారంభంలోనే [రిటైర్ అవ్వాలని] నిర్ణయించుకున్నాను. చాలా మంది యువకులు వస్తున్నారు, వారికి చోటు కల్పించాలి అని తప్ప వేరే కారణమేమీ లేదు." అని అన్నాడు.[1]

క్రికెట్ తర్వాత

[మార్చు]

2012 సెప్టెంబరు 27 న BCCI, కురువిళాను జాతీయ సెలెక్టర్‌గా నియమించింది.[4] ముంబై ఇండియన్స్‌ అతన్ని టాలెంట్ స్కౌట్‌గా నియమించుకుంది.[5]

రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ జట్టులో ప్రవీణ్ తాంబే ఎంపిక కావడానికి ప్రధాన కారణం అతనే. 2020 డిసెంబరు 24 న కురువిళా భారత క్రికెట్ జట్టు జాతీయ సెలెక్టర్‌గా నియమితుడయ్యాడు. [6] [7] అతనికి 2009 నుండి DY పాటిల్ గ్రూప్‌తో అనుబంధం ఉంది. 2022 ఫిబ్రవరి 10 న కురువిళా బోర్డులో తన ఐదేళ్ల ఎంపిక కమిటీ పదవీకాలాన్ని పూర్తి చేసి, ఆ పదవిని విడిచిపెట్టాడు. [8]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Bombay bowler Kuruvilla retires". Rediff.com. United News of India. 22 April 2000. Retrieved 12 February 2018.
  2. "When Abey Kuruvilla reached for the sky". The Cricket Monthly. Retrieved 15 September 2020.
  3. "Who holds the record for most runs in Tests without being dismissed?". ESPNcricinfo. Retrieved 15 September 2020.
  4. "Patil is Chief Selector, Amarnath exits". Wisden India. 27 September 2012. Archived from the original on 8 December 2012.
  5. "IPL 2020: Pravin Amre All Set To Join Mumbai Indians' Talent Scout Team". CricketAddictor (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-12-17. Retrieved 2020-11-04.
  6. "Chetan Sharma, Abey Kuruvilla, Debasis Mohanty appointed to India's selection panel" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2020-12-28.
  7. Karhadkar, Amol; Acharya, Shayan. "BCCI appoints Chetan Sharma as chief selector; Abey Kuruvilla and Debasish Mohanty in panel too". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2020-12-28.
  8. Basu, Arani (2 March 2022). "Cheteshwar Pujara, Ajinkya Rahane, Hardik Pandya get demoted in BCCI central contracts". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-02.