అబ్దుల్లా ముహమ్మద్

వికీపీడియా నుండి
(అబ్దుల్లా ముహమ్మద్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అబ్దుల్లా ముహమ్మద్‌. వివిధ పత్రికలలో వీరి కవితలు, కథాలు, వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు చోటు చేసుకున్నాయి. పలునాటికలు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారం అయ్యాయి..

బాల్యము[మార్చు]

అబ్దుల్లా ముహమ్మద్‌ నల్గొండ జిల్లా పెరిక కొండరంలో 1956 ఆగస్టు 2 న జనన మొందారు. వీరి తల్లితండ్రులు: సైదాబీ, ముహమ్మద్‌ ఖాశిం.

రచనా వ్యాసంగము[మార్చు]

వీరి కలంపేరు: ఎండి చైతన్య (ఎండి. సౌజన్య స్పూర్తితో) చదువు: బి.ఏ. ఉద్యోగం: రాష్ట్ర పోలీసుశాఖ, (సంపాదకులు: 'సురక్ష ' మాసపత్రిక). 1972లో 'యువజన' మాసపత్రికలో ప్రచురితమైన 'వృక్షం' కవిత ద్వారా రచనా వ్యాసంగం ఆరంభమై వివిధ పత్రికలలో కవితలు, కథలు, వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు చోటు చేసుకున్నాయి. పలునాటికలు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారం అయ్యాయి..

రచనలు[మార్చు]

1.పోలీసులకు వ్యక్తిత్వ వికాసం (2004), 2.పోలీసు వాచకం (1994), 3.మహిళలు- బాలికల అక్రమ రవాణా (అనువాదం, 2008), 4.ఓ ప్రధానమంత్రి హత్య (ఇందిరా గాంధీ హత్యోదాంతం, అనువాదం, 1995); నవలలు: 1.సత్యభామ శపథం (1990), 2.శిథిల గుహలు (1990), 3.కాల్‌గరళ్‌ (1992), లక్ష్యం: సామాజిక రుగ్మతల నుండి సమాజాన్ని విముక్తం చేయడనికి సాహిత్యం సాధనంగా కృషి చేస్తున్నారు.

మూలాలు[మార్చు]

అబ్దుల్లా ముహమ్మద్‌.... అక్షరశిల్పులు అనుగ్రంథము, రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, చిరునామా వినుకొండ - 522647 పుట 37