Jump to content

అభోవ్యన్ వీధి

వికీపీడియా నుండి
అభోవ్యన్ వీధి
Abovyan Kh. (1).JPG
మార్గ సమాచారం
పొడవు1.8 కి.మీ. (1.1 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండిసెంట్రల్ రెపబ్లిక్ స్క్వ్యేర్
వరకుఖచాతూర్ అబోవియన్ విగ్రహం
ప్రదేశము
Statesఆర్మేనియా
శీతాకాలంలో అభోవ్యన్ వీధి

అభోవ్యన్ వీధి, ఆర్మేనియా రాజధానయిన యెరెవాన్ లోని కెంట్రాన్ జిల్లా కేంద్రంలో ఉంది. దీనిని 1868 నుండి 1920 వరకు అస్తఫ్యాన్ వీధి అని పిలిచేవారు.

ఈ వీధి సెంట్రల్ రెపబ్లిక్ స్క్వ్యేర్ నుండి ప్రముఖ ఆర్మేనియన్ రచయిత ఖచాతూర్ అబోవియన్ (1809–1848) విగ్రహం వరకు ఉంటుంది, ఆయన పేరున ఈ వీధికి అభోవ్యన్ అను పేరు వచ్చింది. ఆర్మేనియా రాజధానిలో అభోవ్యన్ మొదటి ప్రణాళికబద్ధంగా నిర్మించిన వీధి.

యెరెవాన్ డౌన్టౌన్ లో ఉన్న ఈ వీధిలో ప్రధానంగా సాంస్కృతిక, విద్యా సంస్థలు, విలాసవంతమైన నివాస భవనాలు, ఉన్నత బ్రాండెడ్ దుకాణాలు, వాణిజ్య కార్యాలయాలు, కాఫీ దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రాత్రి క్లబ్బులు ఉన్నవి.

చరిత్ర

[మార్చు]

1855లో రష్యన్ వైస్రాయ్ కాకసస్ యెరెవాన్ నగర వీధుల ప్రణాళిక ధ్రువీకరించారు. వీధుల సగటు వెడల్పును 6 నుండి 20 మీటర్లగా పరిగణించారు. అస్తఫయాన్ వీధిని 20  మీటర్లు వెడల్పుగా నిర్ణయించారు. యెరెవాన్ లో ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం నిర్మించిన మొదటి వీధి అస్తఫయాన్. 1860-1862లో యెరివాన్ గవర్నేటుకు చిందిన గవర్నరు మిఖైల్ పేరిట 1863లో ప్రారంభించారు.[1]

ఈ వీధి అధికారికంగా అస్తఫ్యేస్కయాన్ అని పిలుస్తారు, కానీ నివాసితులు పేరులోని "యెవ్స్కాన్"కు బదులుగా "యన్" అని పిలుస్తారు.ఇందువలనే అస్తఫ్యేస్కయాన్ బదులుగా అస్తఫ్యాన్ అని పిలుస్తారు. 1904లో ఈ వీధిపై హార్స్కార్ వ్యవస్థ పనులను మొదలుపెట్టి రెండు సంవత్సరాలలో పూర్తిచేశారు. కానీ ఇది 1918 వరకు అనగా పన్నెండు సంవత్సరాలు మాత్రమే పనిచేసింది. యెరెవాన్ లోని మొదటి ట్రామ్ అభోవ్యాన్ వీధిలో 1933వ సంవత్సరంలో నడిచింది.

ముఖ్యమైన భవనాలు

[మార్చు]
  • ఆర్నో బబజాన్యన్ కచేరీ హాల్,
  • యెరెవాన్ గ్రాంద్ హోటల్,
  • అలెగ్జాండర్, ఒక లగ్జరీ కలెక్షన్ హోటల్,
  • యెరెవాన్ కంకణాలు సెంటర్,
  • ఆర్మేనియా కళాకారులు యూనియన్,
  • మాస్కో సినిమా,
  • స్టానిస్లవ్స్కి రష్యన్ థియేటరు,
  • కతొగికే, సర్ప్ అన్నా చర్చిలు,
  • యెరెవాన్ రాష్ట్ర మెడికల్ విశ్వవిద్యాలయం,

దుకాణాలు

[మార్చు]

అభోవ్యాన్ వీధి ఎన్నో లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్లు అనగా: కాప్-కపైన్, ఇటామ్, మాంగో, మెక్స్, మోటివి, నౌగట్ లండన్, ఒకైడి, ఒల్సేన్, ప్రొమోద్, సైన్క్వూనోన్ ఉన్నాయి.[2]

గ్యాలరీ

[మార్చు]

సూచనలు

[మార్చు]
  1. (in Armenian)మూస:Hy icon Avetisyan, Kamsar. (The History of Abovyan Street), Sovetakan Grogh publishing house, Yerevan, Armenian SSR, 1979.
  2. "Topshop.am". Archived from the original on 2018-09-15. Retrieved 2018-06-20.