Jump to content

అమరుకుడు

వికీపీడియా నుండి
అమరుకుడు
అమరుశతకంలో సన్నివేశము
అమరుశతకంలో సన్నివేశము

 

అమరుకుడు (లేదా అమరుక ) సంస్కృతంలోని గొప్ప కవులలో ఒకరు. అతని కూర్పు అమరుశతకముప్రసిద్ధి చెందింది. ఇది శృంగారానికి సంబంచిన రచన. ఇందులో భావములు రసమయము మరియు హృదయంగములు. అతని కవిత్వం మరొకటి అందుబాటులో లేవు. వంద పద్యాల ఈ ముక్తక శతకము కారణంగా అతను తన సహృదుయలలో ప్రసిద్ధి చెందాడు. సుభాషితావళి యొక్క ప్రపంచ ప్రసిద్ధి చెందిన నడింధంకులతిలకంలోని రెండవ విశ్వకర్మ పద్యం ద్వారా ఇతను స్వర్ణకారుడు అని తెలుస్తున్నది. అయితే అతని తల్లిదండ్రులు ఎవరనే ప్రస్తావన లేదు.

జీవిత విశేషాలు

[మార్చు]

అమరుకుడు కవిత్వం ఎంత ప్రసిద్ధమో, అతని వ్యక్తిత్వం కూడా అంతే ప్రజాదరణ పొందలేదు. అతని స్థలం ఇంకా సమయం ఇంకా సరిగ్గా నిర్ణయించబడలేదు. రవిచంద్ర, " అమరుశతకము "పై తన వ్యాఖ్యానానికి సంబంధించిన పరిచయంలో, ఆదిశంకరాచార్యను అమరుకుడు ఒక అభిన్న వ్యక్తిగా భావించాడు అని చెబుతారు. ఆదిశంకరాచార్యులు "అమరుకుడు" అనే రాజు మృత దేహంలోకి ప్రవేశించడం అటుపై కామతంత్ర గ్రంథాన్ని రూపొందించడం శంకరదిగ్విజయము లో ఖచ్చితంగా ప్రస్తావించబడ్డాయి, కానీ ఈ వివరణకు పూర్తిగా ఆధారాలు నిర్ణయించబడలేదు.

ఆనందవర్ధనుడు (9వ శతాబ్దం మధ్యలో) అమరుశతకము ( ధ్వన్యలోకం యొక్క మూడవ ఉద్యోత) యొక్క ముక్తకము రచనా చతురోక్తులను కీర్తిని ప్రస్తావించారు. వారి కాలం 9వ శతాబ్దానికి పూర్వం అని ఇది రుజువు చేస్తుంది. ధ్వన్యాలోకం యొక్క మూడవ ఉద్యోత్‌లో ఆనందవర్ధనుడు అమరకుడు గురుంచి ఈవిధంగా చెప్పాడు:

ముక్త్కేషు హి ప్రబన్ధేష్వివ రసబంధాబిబివేశినః కావ్యో దృశ్యన్తే, తథా హ్యమరుకస్య కవేర్ముక్తకాః శృంగారరసస్యాన్దినః ప్రబన్ధయమానాః ప్రసిద్ధా ఏవ.

వామనాచార్యుని కావ్యాలంకారసూత్రవృత్తిలో - "గ్రామేస్మిన్ పథికాయ..." అను అమరుకశ్లోకమునుదహరించుచే, ఇతను క్రీ.శ.8వ శతాబ్దానికి పూర్వుడని ఊహించవచ్చును.పురాతత్త్వవేత్తలు కొందరు క్రీ.శ.7వ శతాబ్దిలోనే అమరుకుండినాడని భావించుచున్నారు.

ఇలా చెబుతూ అమరుశతకంలోని అనేక పద్యాలకు ఉదాహరణగా చెప్పారు. అందుచేత అమరుశతకానికి అంతకుముందే ప్రసిద్ధి కలదని చెప్పవచ్చును..

అమరుశతకము

[మార్చు]

అమరుశతకములో పద్యములు ముక్తకములు.ముక్తకము అన్నప్పుడు ఒక పద్యమునకు మరొక పద్యమునకు సంబంధము ఉండదు.గ్రంథమంతయూ అట్లే ఉన్నప్పట్టికినీ 15,16, 33,36 పద్యములు యుగ్మములుగా కనిపించుచున్నవి.కధాసూత్రమేమియు లేకున్నను, అమృతఘటికాప్రాయములు, శృంగారరస సమయములు అగు ఇటువంటి స్వారస్యము మరొయొకటిలేదు.ఇందలి భావములు, రసములు, హృదయంగములగుటయే కాక, రమణీయములు.ఈకవి దశవిధకవులలో శిల్పి కూడా. పరిశోధకులు అమరుకుడు స్వర్ణకారుడని నిర్ణయించారు. కావుననే ఇందలి వర్ణనములలో సువర్ణత్వమే కాక, విశిష్ట శిల్పముకూడా విస్పష్టముగా పొసగినది. ఇందులో నూరు శ్లోకములే కలవు.కానీ కొన్ని ప్రతులలో అధికశ్లోకములు కలవు.

శార్దూలవిక్రీడితమును రాజశేఖరుడు బాగుగా నడిపినాడని ప్రతీతి.అమరుశతకములోని శార్దూలములు, ప్రసన్నగంభీరములు. విశేషభాగము శార్దూలములో నడిచినను, హరిణీవృత్తముకూడా దీనికి తోడూ కలదు.ప్రసిద్ధి వృత్తములు అనేకములు అమరుకమున ఆయాస్థానములందు కర్ణరసాయనములుగా పొందుపరచబడినవి.కథాసూత్రము లేకున్నను అమరుశతకమునకు మహాకావ్యత్వమును అంగీకరించవచ్చును.

రమణీయమైన ఇట్టి శతకము ను శ్రీ గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి రసబంధురముగా ఆంధ్రీకరించారు.ఈయనకు ముందు అనేకులు దీనిని ఆంధ్రీకరించారు. గరికపాటి మల్లావధాని వారు ఆంధ్రీకరించిన అమరుశతకము ప్రసిద్ధములు.

మూలములు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అమరుకుడు&oldid=4310900" నుండి వెలికితీశారు