అమీర్ ఎలాహి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


అమీర్ ఎలాహి
1936 లో అమీర్ ఎలాహి (బ్యాటింగు చేస్తున్నాడు)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అమీర్ ఎలాహి
పుట్టిన తేదీ(1908-09-01)1908 సెప్టెంబరు 1
లాహోర్, పంజాబ్, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ1980 డిసెంబరు 28(1980-12-28) (వయసు 72)
కరాచీ, సింధ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టులు
తొలి టెస్టు (క్యాప్ 40/1)1947 డిసెంబరు 12 
ఇండియా - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1952 డిసెంబరు 12 
పాకిస్తాన్ - ఇండియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 6 125
చేసిన పరుగులు 82 2,562
బ్యాటింగు సగటు 10.25 16.85
100లు/50లు 0/0 0/3
అత్యధిక స్కోరు 47 96
వేసిన బంతులు 400 24,822
వికెట్లు 7 513
బౌలింగు సగటు 35.42 25.77
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 30
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 6
అత్యుత్తమ బౌలింగు 4/134 8/94
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 67/–
మూలం: Cricinfo.com, 2019 మార్చి 12

అమీర్ ఎలాహి (1908 సెప్టెంబరు 1 - 1980 డిసెంబరు 28) ఒకటి కంటే ఎక్కువ దేశాల తరఫున టెస్టు క్రికెట్ ఆడిన పదిహేను మంది క్రికెటర్లలో ఒకడు. [1] 1947లో ఆస్ట్రేలియాతో భారత్ తరఫున, స్వాతంత్ర్యం తరువాత పాకిస్తాన్ తరఫునా టెస్టులు ఆడినందున అతనికి ఈ గౌరవం లభించింది. అతను తన కెరీర్‌లో 6 టెస్టులు ఆడగా, అందులో పాకిస్తాన్ తరపున 5 ఆడాడు. భారత్‌పై కూడా ఆడాడు. పాకిస్థాన్‌కు తొలి సిరీస్‌లో, అతను కలకత్తాలో తన చివరి టెస్టు ఆడినప్పుడు, అతని వయస్సు 44 సంవత్సరాలు. అతను మీడియం పేసర్‌గా బౌలింగ్1ఉ ప్రారంభించి తరువాతి కాలంలో లెగ్ స్పిన్ బౌలరుగా మారాడు.

ప్రారంభ సంవత్సరాల్లో

[మార్చు]

టెస్ట్ క్రికెట్‌లోకి ప్రవేశించే ముందు, అతను 1936లో భారత జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. 42.94 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 1947-48లో ఆస్ట్రేలియా పర్యటనలో 65.87 సగటుతో 8 వికెట్లు తీయగలిగాడు.స్వాతంత్ర్యం ముందు భారత్‌లో అమీర్ ఇలాహి ప్రసిద్ధ ఆటగాడు. రంజీ ట్రోఫీలో 24.72 సగటుతో 193 వికెట్లు తీశాడు.

స్వాతంత్య్రానంతరం పాకిస్థాన్‌కు వెళ్లి, ఆ తర్వాత పాకిస్థాన్ జట్టుతో కలిసి 1952–53లో పర్యటనకు భారత్‌ వచ్చాడు. అపుడు 38.76 సగటుతో 13 వికెట్లు తీశాడు. మద్రాస్‌లో (ప్రస్తుతం చెన్నై) అతను జుల్ఫికర్ అహ్మద్‌తో కలిసి చివరి వికెట్‌కు 104 పరుగులు చేశాడు. దీనిలో అతను 47 పరుగులు అందించాడు.


అమీర్ ఎలాహి 1980 డిసెంబరు 28 న 72 సంవత్సరాల వయసులో, కరాచీలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Amir Elahi". ESPN Cricinfo.