అమృతాంజనం
Appearance
రకం | తలనొప్పి నివారిణి |
---|---|
ఆవిష్కర్త | కాశీనాథుని నాగేశ్వరరావు |
ప్రారంభ తేదీ | 1893 |
కంపెనీ | అమృతాంజన్ హెల్త్ కేర్ |
లభ్యత | అందుబాటులో ఉంది |
ప్రస్తుత సరఫరాదారు | అమృతాంజన్ హెల్త్‌కేర్ |
అమృతాంజనం అనునది నొప్పి నివారిణిగా వాడబడే ఔషధతైలం. ఇది అమృతాంజన్ హెల్త్ కేర్ అనే సంస్థకు చెందినది.[1][1]
పేరు
[మార్చు]అమృతాంజం పేరు అమృతం + అంజనం అనే రెండు తెలుగు పదాల కలయికతో ఏర్పడింది.
చరిత్ర
[మార్చు]అమృతాంజనం అనబడే ఈ ఔషధ తైలాన్ని 1893 లో భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్టు అయిన కాశీనాథుని నాగేశ్వరరావు కనుగొన్నారు.[2] ఈ ఔషధంతో ఆయన ప్రసిద్ధి చెందాడు. ఆయన సంగీత కచేరీలలో ఉచితంగా సరఫరా చేసేవారు. ప్రస్తుతం కూడా ఈ ఔషధం ప్రసిద్ధి పొందినది. అమృతాంజన్ లిమిటెడ్ గా 1936 లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకొన్నది.[3]
వైద్యంలో ఉపయోగాలు
[మార్చు]ఈ ఔషధాన్ని తలనొప్పికి ఎక్కువగా వాడుతారు.
హోల్డింగ్ కంపెనీ
[మార్చు]ఈ ఉత్పత్తి అమృతాంజన్ హెల్త్‌కేర్కు చెందినది. ఇది ప్రస్తుతం శంభుప్రసాద్ (కాశీనాధుని నాగేశ్వరరావు గారి మనుమడు) చే నిర్వహింపబడుతున్నది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 http://www.thehindubusinessline.com/todays-paper/tp-marketing/amrutanjan-relaunches-pain-balm/article1641852.ece?ref=archive
- ↑ http://www.business-standard.com/article/management/answers-to-last-week-s-quiz-329-113111000505_1.html
- ↑ http://www.livemint.com/Companies/CuMsi9ryaNxmJZ6WglpIDP/Amrutanjan-to-move-into-food-business-set-for-brand-makeove.html