అమెరికాలో బానిసత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1789-1861 మధ్య కాలంలో యునైటెడ్ స్టేట్స్ లో బానిసత్వం అమలు నిషేధాలు, వివిధ రాష్ట్రాల్లో సాగిన విధానాన్ని సూచించే యానిమేషన్

అమెరికాలో బానిసత్వం అనేది 18, 19వ శతాబ్దాల్లో అమెరికాలో స్వాతంత్రం నాటి నుంచి అంతర్యుద్ధం వరకూ చట్టబద్ధంగా సాగిన మానవ బానిసత్వం. వలసల తొలినాళ్ళ నుంచి బ్రిటీష్ ఉత్తర అమెరికాలో బానిసత్వం వ్యాప్తిలో ఉండేది. 1776లో ఇండిపెండెన్స్ డిక్లరేషన్ నాటికి 13 కాలనీలన్నిటిలోనూ దీని వ్యాప్తిని గుర్తించారు.