అయస్కాంతీకరణ తీవ్రత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అయస్కాంతవస్తువును అయస్కాంత క్షేత్రంలో ఉంచితే, అది అయస్కాంత ప్రేరణవల్ల అయస్కాంత ధర్మాలను పొందుతుంది. ఈ విధంగా పొందిన అయస్కాంత ధర్మాలు అయస్కాంత క్షేత్రం నకువ్యతిరేకదిశలో ఉంటుంది. ప్రమాణ ఘనపరిమాణపు వస్తువు పొందిన అయస్కాంత భ్రామకాన్ని (magnetic moment) వస్తువు పొందిన అయస్కాంతీకరణ తీవ్రత అంటారు.[1]

మెగ్నటిక్ ఫీల్డ్
హెచ్ డిడి మెగ్నెట్
అయస్కాంతీకరణ తీవ్రత = అయస్కాంత భ్రామకము (M) / ఘనపరిమాణము (V)

వస్తువు పొడవు l, మధ్యచ్చేద వైశాల్యం a అయితే, దాని ఘణపరిమాణము la. వస్తువు ప్రేరణవల్ల పొందిన అయస్కాంత ధ్రువసత్వము (pole strength) m అయితే, దాని అయస్కాంత భ్రామకము ml.

కనుక అయస్కాంతీకరణ తీవ్రతను, ప్రమాణ మధ్యచ్చేద వైశాల్యమున్న వస్తువు యొక్క అయస్కాంత ధ్రువసత్యంగాకూడా నిర్వచించవచ్చు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ద్రవ్య అయాస్కాంతం ధర్మాలు. హైదరాబాదు: తెలుగు అకాడమి. p. 166.