అయాన్ ర్యాండ్
అయాన్ ర్యాండ్ | |
---|---|
రచయిత మాతృభాషలో అతని పేరు | Алиса Зиновьевна Розенбаум |
పుట్టిన తేదీ, స్థలం | ఆలిసా జినోవ్యేనా రోసెన్‌బామ్ 1905 ఫిబ్రవరి 2 సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా సామ్రాజ్యం |
మరణం | 1982 మార్చి 6 న్యూయార్క్ నగరం, అమెరికా | (వయసు 77)
కలం పేరు | అయాన్ ర్యాండ్ |
వృత్తి |
|
భాష |
|
పౌరసత్వం |
|
పూర్వవిద్యార్థి | లెనిన్గ్రాడ్ స్టేట్ విశ్వవిద్యాలయం |
కాలం | 1934–1982 |
జీవిత భాగస్వామి | ఫ్రాంక్ ఓకానర్
(m. 1929; died 1979) |
సంతకం |
అయాన్ ర్యాండ్ (Ayn Rand) అనే కలం పేరుతో ప్రాచుర్యం పొందిన ఆలిస్ ఓ కానర్ (ఫిబ్రవరి 2, 1905 - మార్చి 6, 1982) రష్యాలో పుట్టిన అమెరికన్ రచయిత్రి, తాత్వికురాలు. ఆమె రాసిన కాల్పనిక రచనలు, ప్రతిపాదించిన ఆబ్జెక్టివిజం అనే తాత్వికత వలన ప్రాచుర్యం పొందింది. రష్యాలో పుట్టి, అక్కడే చదువుకున్న ఈమె 1926లో అమెరికాకు వెళ్ళింది. ముందుగా రాసిన రెండు నవలలు, బ్రాడ్‌వే నాటకాలు విజయవంతం కాకపోయినా 1943లో వచ్చిన ది ఫౌంటెన్ హెడ్ నవలతో మంచి పేరు తెచ్చుకుంది. 1957 లో అట్లాస్ ష్రగ్డ్ అనే పేరుతో మరో విజయవంతమైన నవల రాసింది. తర్వాత 1982 లో ఆమె మరణించేంతవరకు ఆమె తత్వాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి ఎక్కువగా యథార్థ రచనలు, వ్యాసాలు, జర్నల్స్ రాసింది.
ఈమె మతాన్ని, విశ్వాసాల్ని తిరస్కరించింది. హేతువును విశ్వసించింది. కళల్లో ఈమె రొమాంటిక్ రియలిజాన్ని ప్రోత్సహించింది. ఈమె దాదాపు ప్రతి తత్వవేత్తను విమర్శించింది. ఈమె రాసిన పుస్తకాలు 3.7 కోట్లకు పైగా ప్రతులు అమ్ముడయ్యాయి. ఆమె కాల్పనిక సాహిత్యం విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఆమె తరువాతి రచనలకు సమీక్షలు మరింత ప్రతికూలంగా మారాయి.[2] ఆమె మరణం తర్వాత ఆమె ఆలోచనలపై విద్యాపరమైన ఆసక్తి పెరిగినప్పటికీ,[3] విద్యాసంబంధ తత్వవేత్తలు సాధారణంగా రాండ్ తత్వశాస్త్రాన్ని విస్మరించారు లేదా తిరస్కరించారు. ఆమె ఒక వివాదాస్పద విధానాన్ని కలిగి ఉందనీ, ఆమె చేసిన పనిలో ఒక క్రమమైన పద్ధతి లేదని వాదించారు.[4]
గమనికలు
[మార్చు]- ↑ Rand's initial citizenship was in the Russian Empire and continued through the Russian Republic and the Russian Soviet Federative Socialist Republic, which became part of the Soviet Union.
- ↑ Rand's husband, Charles Francis O'Connor (1897–1979),[1] is not to be confused with the actor and director Frank O'Connor (1881–1959) or the writer whose pen name was Frank O'Connor.
మూలాలు
[మార్చు]- ↑ Heller 2009, p. 65.
- ↑ Gladstein 1999, pp. 117–119.
- ↑ Cocks 2020, p. 15.
- ↑ Badhwar & Long 2020.
ఆధార గ్రంథాలు
[మార్చు]- Badhwar, Neera & Long, Roderick T. (Fall 2020). Zalta, Edward N. (ed.). "Ayn Rand". Stanford Encyclopedia of Philosophy. Retrieved May 3, 2021.
- Heller, Anne C. (2009). Ayn Rand and the World She Made. New York: Nan A. Talese/Doubleday. ISBN 978-0-385-51399-9.
- Gladstein, Mimi Reisel (1999). The New Ayn Rand Companion. Westport, Connecticut: Greenwood Press. ISBN 978-0-313-30321-0.
- Gladstein, Mimi Reisel (Spring 2003). "Ayn Rand Literary Criticism". The Journal of Ayn Rand Studies. 4 (2): 373–394. JSTOR 41560226.
- Gladstein, Mimi Reisel (2010). Ayn Rand. Major Conservative and Libertarian Thinkers. New York: Continuum. ISBN 978-0-8264-4513-1.
- Gladstein, Mimi Reisel & Sciabarra, Chris Matthew, eds. (1999). Feminist Interpretations of Ayn Rand. Re-reading the Canon. University Park, Pennsylvania: Pennsylvania State University Press. ISBN 978-0-271-01830-0.
- Cocks, Neil, ed. (2020). Questioning Ayn Rand: Subjectivity, Political Economy, and the Arts. Palgrave Studies in Literature, Culture and Economics (Kindle ed.). Cham, Switzerland: Palgrave Macmillan. ISBN 978-3-030-53072-3.