అయోవా హిందూ దేవాలయం
Appearance
అయోవా హిందూ దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం: | అయోవా |
ప్రదేశం: | మాడ్రిడ్ |
అయోవా హిందూ దేవాలయం, అయోవాలోని రాష్ట్రం మాడ్రిడ్ నగరంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. అయోవా రాష్ట్రంలో నిర్మించిన మొదటి హిందూ దేవాలయమిది.[1] భారతదేశంలో 2000 సంవత్సరాలకుపైగా ఆచరిస్తున్న వైదిక సంప్రదాయాలు, ఆచారాలను ఈ దేవాలయం అనుసరిస్తోంది.
చరిత్ర
[మార్చు]1990ల చివరలో మాడ్రిడ్ ప్రాంతంలోని స్థానిక హిందువులచే ఈ దేవాలయం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించబడింది.[2] ఈ దేవాలయ నిర్మాణంకోసం మొదట సుహాయ్ కుటుంబం 25,000 డాలర్ల విరాళాలు సేకరించగా, అక్కడి హిందూ సమాజం 1.2 మిలియన్ డాలర్లకు పైగా సేకరించగలిగింది. 2005 జూన్ 2005 నాటికి దేవాలయ నిర్మాణం పూర్తయింది.[3]
ఇతర వివరాలు
[మార్చు]హైవే 17లో మాడ్రిడ్ టౌన్‌షిప్‌కు దక్షిణంగా 4 మైళ్ళ దూరంలో డెస్ మోయిన్స్ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం ఉంది. ఇక్కడ అన్ని హిందూ పండుగలు జరుపబడుతున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "First Hindu Temple in Iowa". hinduismtoday. 2005. Retrieved 2 February 2022.
- ↑ Boyd, Carrie (6 March 2008). "Local Hindu temple gives insight into worship and progress". iowastatedaily. Archived from the original on 2 ఫిబ్రవరి 2022. Retrieved 2 February 2022.
- ↑ "History". iowatemple. Retrieved 2 February 2022.