అరకు కాఫీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనుల చేత అరకులోయలో పండుతున్న కాఫీకి ‘అరకుకాఫీ’ అనే పేరు

చరిత్ర[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ 1960లో విశాఖపట్నం జిల్లాలోని రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10,100 ఎకరాలలో అభివృద్ధి చేసారు. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పచెప్పారు. 1956 లో గిరిజన సహకార సంస్ధ ఏర్పాడ్డక, కాఫీ బోర్డు వారు యీ సంస్ధని కాఫీ తోటల అభివృద్ధి కోసం వుపయోగించుకోవాలని వుద్దేశించారు. ఆ రకంగా గుర్తింపబడి, గిరిజనుల ద్వారా కాఫీ తోటల పెంపంకంలో జిసిసి కృషి చేయడం ప్రారంభమైంది. 1975 నుంచి 1985 వరకు జిసిసిలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృది విభాగం పనిచేస్తూ సుమారు 4000 హెక్టర్ల కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలయ్యింది. అరకులో తయారయ్యే అర్గానిక్ కాఫీ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 1985 తర్వాత జిసిసి ఆధ్వర్యంలో అరకుకాఫీ అభివృద్ధి కోసం గిరిజన సహకార కాఫీ అభివృద్ధి సంస్ధ (గిరిజన కోఆపరేటివ్‌ ప్లాంటేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) స్ధాపించారు. ఈ రకంగా ‘జిసిసి’ ద్వారా, జిసిపిడిసి ద్వారా అభివృద్ధి చేసిన కాఫీ తోటల్ని గిరిజన రైతులకు ఒక్కో కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున పంచి ఇచ్చారు. 1997 జూలైలో జిసిపిడిసి సంస్ధ కార్యకలాపాలను సిబ్బందితో సహా ఐటిడిఎలో విలీనంచేసి కాఫీ అభివృద్ధి కార్యక్రమాలను పంచవర్ష ప్రణాళికబద్ధంగానూ, MGNREGS నిధుల సహాయంతో అభివృద్ధి చేసి యీ నాటికి లక్ష ఎకరాలకు చేరి, కాఫీ తోటలు గిరిజన రైతుల ద్వారా సాగు చేస్తున్నారు.[1][2]

ప్రాముఖ్యం[మార్చు]

2003 నుంచి 2012 మధ్యకాలంలో….అంటే పదేళ్ళలో విశాఖ కాఫీ ఏడుసార్లు రీజినల్ స్థాయి అవార్డులు పొందింది. జీకే వీధి, చింతపల్లి, పెదబయలు, మినుములూరు, అనంతగిరి, అరకులోయ తోటల్లో సాగయిన కాఫీ గింజలు నాణ్యమైనవనిగా కాఫీ పంట నిపుణులు తేల్చారు.

మూలాలు[మార్చు]

  1. "Buy Freshly Roasted Coffee | Araku Coffee". www.arakucoffee.in. Retrieved 2020-01-26.
  2. Ganguly, Nivedita (2018-11-29). "A day with the adivasis behind Araku Valley Coffee". The Hindu (ఆంగ్లం లో). ISSN 0971-751X. Retrieved 2020-01-26.
"https://te.wikipedia.org/w/index.php?title=అరకు_కాఫీ&oldid=2886452" నుండి వెలికితీశారు