అరబింద ధాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరబింద ధాలి

అరబింద ధాలి, ఒక ఒడిశాకు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఇతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు. ధాలి ఒడిశా శాసనసభకు ఆరవసార్లు సభ్యుడుగా ఎన్నికయ్యాడు.1992 నుండి 2000 వరకు మల్కన్‌గిరి [1] నుండి, 2009 నుండి 2014 వరకు జయదేవ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.[2] అతను బిజూ జనతా దళ్ , భారతీయజనతా పార్టీ కూటమిలో మాజీ రవాణా, కార్పొరేషన్ మంత్రిగా చేసాడు. [3] [4] అతను 2006 ఏప్రిల్ 30న భారతీయ జనశక్తి పార్టీలో చేరడానికి బిజెపి, ఒడిశా నుండి వైదొలిగారు. ఒడిశా శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ రామ చంద్ర పాండాతో కలిసి భారతీయ జనశక్తి పార్టీలో చేరారు. ఆ తర్వాత, 2008 మార్చి 24న సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. [5] తరువాత, అతను తిరిగి బిజూ జనతాదళ్‌లో చేరాడు. 2019 ఒడిశా శాసనసభ ఎన్నికలలో జయదేవ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలుపొందాడు. తరువాత అతను బిజెడిని వీడి, 2024 మార్చి 3న భారతీయ జనతా పార్టీలో చేరాడు. [6] ఖుర్దా జిల్లా లోని జయదేవ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఢాలి 2024 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బిజెపి నుండి బిజూ జనతా దళ్ అభ్యర్థి నబా కిషోర్ మల్లిక్ పై పోటీ చేసి ఓడిపాయాడు. [7]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Sitting and previous MLAs from Malkangiri Assembly Constituency". elections.in.
  2. "Sitting and previous MLAs from Jayadev Assembly Constituency". elections.in.
  3. "'Daughter' roped in to defeat 'father'"
  4. "Former Minister Arabinda Dhali to join in the ruling BJD". Archived from the original on 20 December 2016. Retrieved 16 December 2016.
  5. "Orissa unit of Bharatiya Janshakti merges with SP". news.webindia123.com. Archived from the original on 12 February 2021. Retrieved 2021-03-03.
  6. "Odisha: Jayadev MLA Arabinda Dhali quits BJD, to join BJP". The Economic Times. 2024-03-03. ISSN 0013-0389. Retrieved 2024-04-02.
  7. "odisha assembly elections: BJP releases list of 112 candidates for Odisha assembly elections". The Economic Times. Retrieved 2024-04-06.