అరిత్ర దత్తా
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | చెన్నై, తమిళనాడు | 1991 ఆగస్టు 15
బ్యాటింగు | కుడిచేతి వాటం |
పాత్ర | బ్యాటింగ్ |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు | |
తొలి T20I (క్యాప్ 16) | 2019 29 సెప్టెంబరు - Zimbabwe తో |
చివరి T20I | 2024 11 ఫిబ్రవరి - Japan తో |
మూలం: Cricinfo, 11 ఫిబ్రవరి 2024 |
అరిత్ర దత్తా (జననం 1991, ఆగస్టు 15) సింగపూర్ క్రికెటర్.[1] 2018 అక్టోబరులో, అతను ఒమన్‌లో జరిగే 2018 ఐసిసి వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ త్రీ టోర్నమెంట్‌లో సింగపూర్ జట్టులో ఎంపికయ్యాడు.[2] 2018, నవంబరు 10న ఒమన్‌తో జరిగిన టోర్నమెంట్ సింగపూర్ ప్రారంభ మ్యాచ్‌లో ఆడాడు.[3] ఐదు మ్యాచ్‌ల్లో 204 పరుగులతో టోర్నమెంట్‌లో సింగపూర్ తరఫున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[4]
2019 సెప్టెంబరులో, 2019-20 సింగపూర్ ట్రై-నేషన్ సిరీస్ కోసం సింగపూర్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[5] 2019 సెప్టెంబరు 29న సింగపూర్ ట్రై-నేషన్ సిరీస్‌లో జింబాబ్వేపై సింగపూర్ తరపున తన టీ20 అరంగేట్రం చేసాడు.[6] 2019 అక్టోబరులో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే 2019 ఐసిసి టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం సింగపూర్ జట్టులో ఎంపికయ్యాడు.[7]
2023 అక్టోబరులో, దత్తా 2023 ఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్ ఆసియా క్వాలిఫైయర్ టోర్నమెంట్‌కు సింగపూర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Aritra Dutta". ESPN Cricinfo. Retrieved 9 November 2018.
- ↑ "Squads and match schedule announced for ICC World Cricket League Division 3". International Cricket Council. Retrieved 31 October 2018.
- ↑ "4th Match, ICC World Cricket League Division Three at Al Amarat, Nov 10 2018". ESPN Cricinfo. Retrieved 10 November 2018.
- ↑ "ICC World Cricket League Division Three, 2018/19 - Singapore: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 19 November 2018.
- ↑ "INSTAREM tri-series Singapore 2019-20 – Fixtures, Schedule, Venues, Squads, Match Timings and Live Streaming Details". CricTracker. Retrieved 26 September 2019.
- ↑ "3rd Match (N), Singapore Twenty20 Tri-Series at Singapore, Sep 29 2019". ESPN Cricinfo. Retrieved 29 September 2019.
- ↑ "ICC T20 World Cup Qualifier – UAE". Cricket Singapore. Retrieved 10 October 2019.