అరుళ్ శరవణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుళ్ శరవణన్
జననం
అరుళ్ శరవణన్

1970
జాతీయత భారతీయుడు
వృత్తివ్యాపారవేత్త, మోడల్‌, సినిమా నటుడు
జీవిత భాగస్వామిసూర్యశ్రీ
పిల్లలుఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు
తల్లిదండ్రులుశరవణన్‌ సెల్వరత్నమ్‌

అరుళ్ శరవణన్ భారతదేశానికి చెందిన వ్యాపారవేత్త, మోడల్‌, సినిమా నటుడు. ఆయన 2022లో ది లెజెండ్ సినిమా ద్వారా సినీరంగంలోకి హీరోగా అడుగుపెట్టాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

అరుళ్ శరవణన్ 1970 జులై 10న చెన్నైలో జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదివాడు.

వ్యాపార జీవితం[మార్చు]

అరుళ్ శరవణన్ తండ్రి శరవణన్‌ సెల్వరత్నం అడుగుజాడల్లో వ్యాపారంలోకి అడుగుపెట్టి శరవణ స్టోర్స్ సంస్థలో భాగంగా టెక్స్‌టైల్స్‌, జ్యువెలరీ స్టోర్స్‌, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నగలు దుస్తులు, ఫర్నిచర్‌ సహా వివిధ వ్యాపారాలను చూసుకుంటున్నాడు.

సినీ జీవితం[మార్చు]

అరుళ్ శరవణన్ 'శరవణ స్టోర్స్‌'కు ఆయనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ 2019లో తమన్నా, హన్సికలతో రూపొందించిన ప్రచార చిత్రాలు ట్రెండ్‌ అయ్యాయి. ఆయన ఆ తరువాత చెన్నైలోని అడయార్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకొని 2022లో ‘ది లెజెండ్’ సినిమా ద్వారా హీరోగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

మూలాలు[మార్చు]

  1. Eenadu (27 July 2022). "వేల ఉద్యోగులున్న కంపెనీకి బాస్‌.. 51ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ". Archived from the original on 28 July 2022. Retrieved 28 July 2022.