అర్జున్ టెండూల్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అర్జున్ టెండూల్కర్
Sachin Tendulkar family.jpg
2013లో తన కుటుంబంతో అర్జున్ (ఎడమ నుండి రెండవవాడు).
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు అర్జున్ సచిన్ టెండూల్కర్
జననం (1999-09-24) 1999 సెప్టెంబరు 24 (వయసు 23)
ముంబయి, మహారాష్ట్ర, భారతదేశం
బ్యాటింగ్ శైలి ఎడమచేతి
బౌలింగ్ శైలి ఎడమ చేయి, మీడియం-ఫాస్ట్
పాత్ర బౌలర్
సంబంధాలు సచిన్ టెండూల్కర్ (తండ్రి)[1]
రమేష్ టెండూల్కర్ (తాత)
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2020-21 – ప్రస్తుతం ముంబయి క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ T20
మ్యాచులు 2
Runs scored 3
బ్యాటింగ్ సరాసరి 3.00
100s/50s 0/0
అత్యధిక స్కోరు 3
బౌలింగ్ చేసిన బంతులు 42
వికెట్లు 2
బౌలింగ్ సరాసరి 33.50
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0
మ్యాచ్ లో 10 వికెట్లు 0
ఉత్తమ బౌలింగ్ 1/33
క్యాచులు/స్టంపులు 0/–
Source: Cricinfo, 2 April 2021 {{{year}}}

అర్జున్ సచిన్ టెండూల్కర్ (జననం 1999 సెప్టెంబరు 24) ఒక భారతీయ క్రికెటర్.[2] అతను సచిన్ టెండూల్కర్ కుమారుడు.[3]

కెరీర్[మార్చు]

అర్జున్ టెండూల్కర్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్. 2018లో శ్రీలంకపై అండర్-19 టోర్నీతో అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేసాడు.[4] అలాగే 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానాపై ముంబై తరపున 2021 జనవరి 15న తన టి20 ఫార్మాట్ క్రికెట్ లో అడుగుపెట్టాడు.[5] ఇందులో మూడు ఓవర్లలో 34 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.[6]

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2021కి ముందు ఫిబ్రవరి 2021లో జరిగిన ఐపిఎల్ వేలంలో అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది[7][8] 2021 సెప్టెంబరులో మొదటిసారిగా ముంబై సీనియర్ జట్టులో అర్జున్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. ముంబై 22 మంది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టులో అతను ఒక ఆటగాడు.[9] అయితే గాయం కారణంగా 2021 ఐపిఎల్ నుండి తొలగించబడ్డాడు.[10] అతన్ని 2022 ఫిబ్రవరిలో మళ్లీ ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది, ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2022 టోర్నీ 2022లో మార్చి 26 నుండి మే 29 వరకు జరిగింది.[11] అయితే ఇందులో ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం కూడా అతనికి రాలేదు.

ఆ తరువాత ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకుని గోవా జట్టుకు అర్జున్ టెండూల్కర్ బౌలర్ గా ఎంపికైయ్యాడు. అయితే 2022 డిసెంబరు 14న రంజీ ట్రోఫీ ఎలైట్ విభాగంలో తన తొలి మ్యాచ్ లోనే సెంచరీ నమోదు చేశాడు. రాజస్థాన్ జట్టుతో గ్రూప్-సి మ్యాచ్ లో ఏడోస్థానంలో బ్యాటింగ్ కు దిగిన అతను 207 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులతో 120 పరుగుల స్కోరు నమోదుచేసాడు.[12]

23 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ మొదటి మ్యాచ్ తోనే శతక వీరుల జాబితాలో చేరాడు. ఈ ఘనత సచిన్ టెండుల్కర్ 15 ఏళ్ల వయసులోనే సాధించడం విశేషం.

  1. "Sachin Tendulkar's son Arjun selected for the under-14 Mumbai team". 10 January 2013. Archived from the original on 5 March 2013.
  2. "Arjun Tendulkar". ESPN Cricinfo. Retrieved 15 January 2021.
  3. "Arjun Tendulkar breaks into India Under-19 squad". ESPN Cricinfo. Retrieved 15 January 2021.
  4. "IPL 2020: Fans curious after spotting Arjun Tendulkar with Mumbai Indians players in UAE". India Today (in ఇంగ్లీష్). September 15, 2020. Retrieved 2021-09-06.
  5. "Elite, Group E, Mumbai, Jan 15 2021, Syed Mushtaq Ali Trophy". ESPN Cricinfo. Retrieved 15 January 2021.
  6. "Arjun Tendulkar returns 1-34 in unremarkable senior Mumbai debut". ESPN Cricinfo. Retrieved 15 January 2021.
  7. "IPL Auction 2021 Players list update: Mumbai Indians buy Arjun Tendulkar for base price of Rs 20 lakh". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 18 February 2021.
  8. "IPL 2021 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 18 February 2021.
  9. "Arjun Tendulkar picked in Mumbai's senior squad for 1st time, set to feature in Syed Mushtaq Ali Trophy". India Today (in ఇంగ్లీష్). January 2, 2021. Retrieved 2021-09-06.
  10. "Mumbai Indians rope in Simarjeet Singh as Arjun Tendulkar's replacement". ESPN Cricinfo. Retrieved 29 September 2021.
  11. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 13 February 2022.
  12. "Arjun Tendulkar: సచిన్‌ బాటలో అర్జున్‌.. రంజీ అరంగేట్రంలో సెంచరీ". web.archive.org. 2022-12-14. Archived from the original on 2022-12-14. Retrieved 2022-12-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బాహ్య లంకెలు[మార్చు]