అలంగీర్ ఆలం
అలంగీర్ ఆలం | |||
పార్లమెంటరీ వ్యవహారాల, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 29 డిసెంబర్ 2019 – 2024 జూన్ 11 | |||
గవర్నరు | ద్రౌపది ముర్ము రమేష్ బైస్ సీ.పీ. రాధాకృష్ణన్ | ||
---|---|---|---|
ముందు | నీల్కాంత్ సింగ్ ముండా | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | అక్విల్ అక్తర్ | ||
నియోజకవర్గం | పాకూర్ | ||
పదవీ కాలం 2000 – 2009 | |||
తరువాత | అక్విల్ అక్తర్ | ||
నియోజకవర్గం | పాకూర్ | ||
జార్ఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | హుండు |
అలంగీర్ ఆలం భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పాకుర్ నియోజకవర్గం నుండి 2000, 2004, 2014, 2019 ఎన్నికలలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 20 అక్టోబర్ 2006 నుండి 12 డిసెంబర్ 2009 వరకు జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్‌గా పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]అలంగీర్ ఆలం తన మామ హాజీ ఎనుల్ హక్ వారసుడిగా రాజకీయాలలోకి వచ్చి 1995లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పాకూర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి బేణి ప్రసాద్ గుప్తా చేతిలో ఓడిపోయి ఆ తరువాత 2000లో జరిగిన ఎన్నికలలో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత 2004 లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి 20 అక్టోబర్ 2006 నుండి 12 డిసెంబర్ 2009 వరకు జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసి 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. అలంగీర్ ఆలం ఆ తరువాత 2014, 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఆ తరువాత హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో 29 డిసెంబర్ 2019 నుండి పార్లమెంటరీ వ్యవహారాల, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడంతో 2024 జూన్ 11 మంత్రి పదవికి రాజీనామా చేశాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ The Telegraph (29 December 2019). "Meet the first batch of ministers in the Hemant Soren government". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
- ↑ The Hindu (11 June 2024). "Jharkhand Congress Minister Alamgir Alam resigns from post" (in Indian English). Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
- ↑ Prajasakti (11 June 2024). "మంత్రి పదవికి రాజీనామా చేసిన జార్ఖండ్ నేత ఆలంగీర్ ఆలం". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
- ↑ NT News (11 June 2024). "మంత్రి పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.