అలకలతోపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గజ వాహనంపై లక్ష్మీ అమ్మవారు

అలకలతోపు లేక అలకలతోపు మహోత్సవం అనునది వివిధ దేవాలయాలలో జరిగే బ్రహ్మోత్సవాలలో ఏకాంత సేవకు ముందు జరుగుతుంది.[1] దీనిని ప్రణయ కలహోత్సవం అని కూడా అంటారు.[2] అలకలతోపు మహోత్సవంలో అమ్మవారు అలగడం అయ్యవారు అమ్మవారి అలక తీర్చడం ఈ ఉత్సవంలోని ప్రధాన ఘట్టం. ఈ ఉత్సవం మానవాళికి ఒక సందేశానిస్తుంది.

నెల్లూరు నగరంలోని మూలాపేట మూలస్థానేశ్వరాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా అలకలతోపు ఉత్సవం జరుగుతుంది. అమ్మవారిని పులి వాహనంపై, స్వామి వారికి నంది వాహనంపై ఉంచి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.[3]

జొన్నవాడ శ్రీమల్లిఖార్జున సమేత కామాక్షీతాయి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అలకలతోపు కార్యక్రమం 2017 మే 26న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలిగిన అమ్మవారు మెట్టినింటి (ఆలయం) నుండి రథ మండపానికి వచ్చారు. బంధుమిత్ర సపరివారంతో వెళ్లిన స్వామివారు అమ్మవారిని బుజ్జగించి తిరిగి ఆలయానికి తీసుకువచ్చే అలకలతోపు కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు.[4]

ఇవి కూడా చూడండి[మార్చు]

బ్రహ్మోత్సవాలు

ఏకాంత సేవ

మూలాలు[మార్చు]

  1. admin. "వేడుకగా అలకలతోపు ఉత్సవం | TIMES OF NELLORE" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-01.[permanent dead link]
  2. https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-734206[permanent dead link]
  3. https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-734206[permanent dead link]
  4. "వేడుకగా బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాలు | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2020-06-01.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అలకలతోపు&oldid=3899048" నుండి వెలికితీశారు