Jump to content

అలవాటు పడటం

వికీపీడియా నుండి

అలవాటు పడటం (Habituation) ఒక సరళమైన ప్రవర్తనా వైఖరి. ఒక జీవికి ఒకే విధమైన ప్రేరణలు అనేక సార్లు గురిచేసినపుడు అది సహజమైన ప్రవర్తనను కోల్పోయి ప్రేరణ కనుగుణమైన ప్రవర్తనను ఏర్పరచుకుంటుంది. ప్రమాద భరితమైన ప్రేరణలకు కూడా జీవి స్పందించి తప్పించుకునే మార్గం వెతుక్కుంటుంది.

ఉదాహరణకు ఒక గాజు పలక మీద నడుస్తున్న నత్త, గాజు ఫలకాన్ని తట్టినప్పుడు అది తన కర్పరంలోకి వెంటనే వెళ్ళుతుంది. మరల బయటకు వచ్చిన నత్త, రెండోసారి తట్టినప్పుడు మళ్ళీ కర్పరంలోకి వెళుతుంది, కానీ ఈసారి తొందరగా బయటికి వస్తుంది. ఈ ప్రక్రియను కొన్నిసార్లు పునరావృతం చేసినపుడు, నత్త నిర్లిప్తత జూపి, అనుక్రియను ప్రదర్శించడం మానివేస్తుంది. అనగా నత్త గాజు ఫలకాన్ని తట్టడానికి అలవాటు పడుతుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]