అలా నిన్ను చేరి
అలా నిన్ను చేరి | |
---|---|
దర్శకత్వం | మారేష్ శివన్ |
రచన | మారేష్ శివన్ |
నిర్మాత | కొమ్మాలపాటి సాయి సుధాకర్ |
తారాగణం | దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, ఝాన్సీ, చమ్మక్ చంద్ర |
ఛాయాగ్రహణం | ఐ ఆండ్రూ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | సుభాష్ ఆనంద్ |
నిర్మాణ సంస్థ | విజన్ మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 10 నవంబరు 2023 |
సినిమా నిడివి | 159 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అలా నిన్ను చేరి 2023లో విడుదలైన తెలుగు సినిమా. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకు మారేష్ శివన్ దర్శకత్వం వహించాడు.[1] దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సినిమా టైటిల్ సాంగ్ ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, ట్రైలర్‌ను అక్టోబర్ 18న చేయగా సినిమాను నవంబర్ 10న విడుదల చేసి, డిసెంబర్ 23 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- దినేష్ తేజ్
- హెబ్బా పటేల్
- పాయల్ రాధాకృష్ణ
- శివకుమార్ రామచంద్రవరపు
- శత్రు
- చమ్మక్ చంద్ర
- కల్పలత
- రంగస్థలంమ హేష్
- ఝాన్సీ
- కేదర్ శంకర్
కథ
[మార్చు]గణేష్‌కు (దినేష్ తేజ్) సినిమాలంటే ఇష్టం దర్శకుడు అవ్వాలనే లక్ష్యంతోఉంటాడు. అదే ఊరికే చెందిన దివ్యతో (పాయల్ రాధాకృష్ణ)తో ప్రేమలో పడతాడు. వారి ప్రేమకు దివ్య తల్లి కనకమ్మ (ఝాన్సీ) నిరాకరిస్తూ, దివ్యను కాళీకి (శత్రు) ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆ పెళ్లి అడ్డుకొమ్మని దివ్య కోరినా గణేష్ పట్టించుకోకుండా పెళ్లి కంటే కెరీర్ ముఖ్యమని హైదరాబాద్ వెళ్లిపోతాడు. హైదరాబాద్‌లో గణేష్‌కు అను (హెబ్బాపటేల్) తో పరిచయం ఏర్పడుతుంది. సినిమా దర్శకుడు కావాలనే గణేష్ కల నెరవేరిందా? కాళీతో దివ్య పెళ్లి జరిగిందా? అను, దివ్యలలో గణేష్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేదే మిగతా సినిమా కథ..[4]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- సమర్పణ: కొమ్మాలపాటి శ్రీధర్
- నిర్మాత: కొమ్మాలపాటి సాయి సుధాకర్
- కథ,స్క్రీన్‌ప్లే,మాటలు,దర్శకత్వం: మారేష్ శివన్
- సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ బాబు
- ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
- సంగీత దర్శకుడు: సుభాష్ ఆనంద్
- ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కొసనం
- ఫైట్స్: కింగ్ సోల్మాన్ (జాతీయ అవార్డు విజేత), రామ కృష్ణ
- కాస్ట్యూమ్ డిజైనర్: ముదాసర్ మహ్మద్
- పబ్లిసిటీ: ధని ఏలె
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కర్నాటి రాంబాబు
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (6 November 2023). "'అలా నిన్ను చేరి'.. థియేటర్ నుంచి వచ్చాక కూడా వెంటాడుతుంది: మారేష్ శివన్". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
- ↑ A. B. P. Desam (23 December 2023). "ఓటీటీలోకి వచ్చిన దినేష్ తేజ్, హెబ్బా పటేల్ సినిమా 'అలా నిన్ను చేరి'". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
- ↑ Andhrajyothy (23 December 2023). "అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి 'అలా' వచ్చేసింది". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
- ↑ Sakshi (10 November 2023). "'అలా నిన్ను చేరి' మూవీ రివ్యూ". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.