అలుగు (తెలంగాణ కథ 2015)
| అలుగు (తెలంగాణ కథ 2015) | |
| కృతికర్త: | కథా సంకలనం |
|---|---|
| సంపాదకులు: | సంగిశెట్టి శ్రీనివాస్ డా. వెల్దండి శ్రీధర్ |
| దేశం: | భారత దేశము |
| భాష: | తెలుగు |
| విభాగం (కళా ప్రక్రియ): | కథలు |
| ప్రచురణ: | సింగిడి (తెలంగాణ రచయితల సంఘం) |
| విడుదల: | 2016, డిసెంబరు |
| పేజీలు: | 112 |
అలుగు (తెలంగాణ కథ 2015) అనేది సింగిడి (తెలంగాణ రచయితల సంఘం) ప్రచురించిన పుస్తకం.[1] తెలంగాణ కథా సిరీస్ లో భాగంగా ప్రచురించబడిన మూడవ పుస్తకం ఇది. 2015లో వెలువడిన కథలలో నుంచి తెలంగాణ రచయితలు రాసిన 12 మంచి కథలతో ఈ సంకలనంగా వెలువడింది.
సంపాదకులు
[మార్చు]- సంగిశెట్టి శ్రీనివాస్
- డా. వెల్దండి శ్రీధర్
పుస్తకం గురించి
[మార్చు]రైతుల నేపథ్యంలో రాయబడిన ప్రయాణం ఆగింది (మేడి చైతన్య), ఆకుపచ్చ నెత్తుటి జాడ (కొట్ట రామకృష్ణారెడ్డి) కథలు, వ్యవస్థలోని ఏ వ్యక్తీ తన వల్ల జరిగిన తప్పును ఒప్పుకోడు ఆ తప్పును పక్కవాని మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడన్న నేపథ్యంలో చీమా చీమాఎందుకు పుట్టావ్? (పెద్దింటి అశోక్ కుమార్) కథ, పోలీసు దోపిడీకి - బలవంతుని పీడనకు గురైన బక్క పల్చని మనిషి నేపథ్యంలో బక్కడు (కె.వి. నరేందర్) కథ, రియలెస్టేట్ రంగం చెరువును కూడా వదలకుండా ఆక్రమణలు-అక్రమంగా భవనాలు నిర్మించి నీటి తల్లికి సమాధులు కడుతున్నారన్న నేపథ్యంలో ‘ఏరువాక’ (రావుల కిరణ్మయి) కథ, పేదవాడికి తినే స్వేచ్ఛ ఈ దేశ ప్రజాస్వామ్యం కల్పించలేకపోతోందన్న నేపథ్యంలో ‘బుక్కెడుబువ్వ’ (చందు తులసి) కథ, ముస్లీం మైనార్టీలు ఒకే సమయంలో అటు హిందుత్వవాదులతో ఇటు పేదరికంతో పోరాడలన్న నేపథ్యంలో ‘యుద్ధం’ (గుర్రం ఆనంద్) కథ, జీవితం ఇంత సంక్లిష్టం అయిపోయిన సందర్భంలో బతుకు నడవడం కష్టమన్న నేపథ్యంలో ‘ఆవలితీరం’ (సరస్వతి రమ్య) కథ, మానవ సంబంధాలు స్వచ్ఛమైన పూ పరిమళాలను వెదజల్లన్న నేపథ్యంలో ‘గంధపు దండ’ (రవి వీరెల్లి) కథ, సంక్షోభ భరితమైన-సంఘర్షణాయుతమైన జీవితం గురించిన నేపథ్యంలో ‘ఒక్క పదం చాలు’ (భగవంతం) కథలు రాయబడ్డాయి.[2]
ఆవిష్కరణ
[మార్చు]2016, డిసెంబరు 22న హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బిసి కమీషన్ తొలి చైర్మన్ బి.ఎస్. రాములు పుస్తకాన్ని ఆవిష్కరించాడు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పసునూరి రవీందర్, కవి యాకూబ్, వెల్దండి శ్రీధర్, కథకులు రచయితలు పాల్గొన్నారు.
విషయసూచిక
[మార్చు]| క్రమసంఖ్య | కథ పేరు | రచయిత పేరు |
|---|---|---|
| 1 | ఆవలితీరం | సరస్వతి రమ్య |
| 2 | గంధపు దండ | రవి వీరెల్లి |
| 3 | చీమా చీమీ ఎందుకు పుట్టావ్? | పెద్దింటి అశోక్ కుమార్ |
| 4 | పచ్చీసు | కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి |
| 5 | వలస పక్షులు | దేవులపల్లి కృష్ణమూర్తి |
| 6 | ఒక్క పదంచాలు | భగవంతం |
| 7 | ఏరువాక | రావుల కిరణ్మయి |
| 8 | బక్కడు | కె.వి. నరేందర్ |
| 9 | యుద్ధం | గుర్రం |
| 10 | ప్రయాణం ఆగింది | మేడి చైతన్య |
| 11 | ఆకుపచ్చని నెత్తుటి జాడ | కొట్టం రామకృష్ణారెడ్డి |
| 12 | బుక్కెడు బువ్వ | చందు తులసి |
మూలాలు
[మార్చు]- ↑ "అలుగు (తెలంగాణ కథ - 2015)". lit.andhrajyothy.com. Archived from the original on 2017-10-03. Retrieved 2021-12-27.
- ↑ "తెలంగాణ కథల వెలుగు "అలుగు"". సారంగ (in అమెరికన్ ఇంగ్లీష్). వెల్డండి శ్రీధర్, శ్రీనివాస్ సంగిశెట్టి. 2016-12-22. Archived from the original on 2021-12-27. Retrieved 2021-12-27.
