Jump to content

అల్కా లాంబా

వికీపీడియా నుండి
అల్కా లాంబా
ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ
In office
2015 ఫిబ్రవరి 7 – 2019 సెప్టెంబరు 19
అంతకు ముందు వారుపర్లాద్ సింగ్ సాహ్నీ
తరువాత వారుపర్లాద్ సింగ్ సాహ్నీ
నియోజకవర్గంచాందినీ చౌక్
నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు
In office
1997–1999
అంతకు ముందు వారుసలీమ్ అహ్మద్
తరువాత వారుమీనాక్షి నటరాజన్
వ్యక్తిగత వివరాలు
జననం (1975-09-21) 1975 సెప్టెంబరు 21 (వయసు 49)
న్యూ ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (2019 సెప్టెంబరు 6 నుండి ఇప్పటి వరకు)
ఇతర రాజకీయ
పదవులు
ఆమ్ ఆద్మీ పార్టీ (2014–2019)
వృత్తిరాజకీయ నాయకురాలు

అల్కా లాంబా (జననం 1975 సెప్టెంబరు 21) భారతీయ రాజకీయవేత్త. దాదాపు 20 సంవత్సరాలకు పైగా వివిధ హోదాల్లో భారత జాతీయ కాంగ్రెస్‌కు సేవలందించిన తర్వాత,[1] ఆమె 2014 డిసెంబరు 26న ఆమ్ ఆద్మీ పార్టీలో చేరింది.[2] ఫిబ్రవరి 2015లో, ఆమె చాందినీ చౌక్ నుండి ఢిల్లీ శాసనసభకు ఎన్నికయ్యింది. కానీ, తన పట్ల అగౌరవాన్ని ఎత్తి చూపుతూ సెప్టెంబరు 2019లో ఆమె ఆ పార్టీని కూడా వీడింది. 2019 సెప్టెంబరు 6న, ఆమె అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చింది.[3] అయితే, పార్టీ మార్పు కారణంగా ఆమెను స్పీకర్ ఢిల్లీ శాసనసభకు అనర్హురాలుగా ప్రకటించాడు.[4]

ఆమె విద్యార్థి నాయకురాలిగా తన వృత్తిని ప్రారంభించింది. ఆమె గతంలో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) జాతీయ అధ్యక్షురాలిగా, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(AICC) కార్యదర్శిగా విధులు నిర్వర్తించింది. ఆమె గో ఇండియా ఫౌండేషన్ అనే ప్రభుత్వేతర సంస్థ(NGO) చైర్‌పర్సన్ కూడా.[5][6]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఆమె న్యూ ఢిల్లీలో ఇండియన్ ఆర్మీ సివిలియన్ ఇంజనీర్ అయిన అమర్ నాథ్ లాంబా, రాజ్ కుమారి దంపతులకు జన్మించింది. ఆమె ఆరుగురు తోబుట్టువులలో ఒకరు.[7]

ఆమె పాఠశాల విద్యను ఢిల్లీలోని ప్రభుత్వ బాలికల సీనియర్ సెకండరీ స్కూల్ నెం.1లో పూర్తి చేసింది. తర్వాత ఆమె 1996లో ఢిల్లీలోని దయాల్ సింగ్ కళాశాల నుండి బీఎస్సీ డిగ్రీని పొందింది. ఆ తరువాత, ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీని కూడా అభ్యసించింది.[8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె లోకేష్‌ కపూర్‌ని పెళ్లాడింది. ప్రస్తుతం వారు విడాకులు తీసుకున్నారు. వీరికి హృతిక్ లాంబా అనే కుమారుడు ఉన్నాడు.[9]

సామాజిక సేవ

[మార్చు]

అల్కా లాంబా నిర్వహిస్తున్న గో ఇండియా ఫౌండేషన్ అనే ప్రభుత్వేతర సంస్థ 2010లో రక్తదాన ప్రచారంలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కరోజులో 65000 మందికి పైగా రక్తదానం చేయడం విశేషం.[10] ఈ ప్రచారాన్ని సల్మాన్ ఖాన్ చేసాడు.[11]

మూలాలు

[మార్చు]
  1. "Chandni Chowk redevelopment plan draws conflicting views". The Pioneer.
  2. "Alka Lamba, former student leader, quits Congress to join AAP".
  3. "Alka Lamba returns to Congress fold: Leaving 'Khas Aadmi Party'". Express News Service. 7 September 2019. Retrieved 2020-09-20 – via The Indian Express.
  4. "Delhi Speaker disqualifies Alka Lamba from the legislative assembly". www.aninews.in (in ఇంగ్లీష్). Retrieved 2019-09-19.
  5. "Indian national overseas congress pays tribute to Alka Lamba senior leader, India congress committee". triblocal.com. 9 November 2011. Archived from the original on 4 అక్టోబరు 2013. Retrieved 30 September 2013.
  6. Alka Lamba: Youth on her side. The Times of India. 19 November 2003. Retrieved 20 April 2013.
  7. "Alka Lamba Wiki, Bio, Age, Career and Profile". Ganga News English (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-04-11. Retrieved 2020-04-11.
  8. "Know Your Delhi Leader: Alka Lamba". NDTV.com. Retrieved 2021-07-21.
  9. "Lamba's spouse wants son's custody, flat | Delhi News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). November 18, 2003. Retrieved 2021-07-23.
  10. "Alka Lamba hogs limelight from Guwahati molestation case – News Oneindia". Oneindia.in. 18 July 2012. Archived from the original on 4 అక్టోబరు 2013. Retrieved 3 October 2013.
  11. "Salman Khan extends support to blood donation camp – Indian Express". The Indian Express. 13 August 2010. Archived from the original on 4 అక్టోబరు 2013. Retrieved 3 October 2013.