అల్బర్ట్ ఎ మైకెల్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్బర్ట్ ఎ మైకెల్సన్ (1907)

అల్బర్ట్ అబ్రహం మైకెల్సన్ (డిశంబరు 19, 1852-  1931 మే 9) అనే వ్యక్తి అమెరికా భౌతిక శాస్ర్తవేత్త. ఇతను కాంతి వేగం యొక్క కొలత, మైకెల్సన్ - మొర్లెయ్ ప్రయోగానికి ప్రసిద్ధి. ఇతను 1907 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ని పొందారు. దీనితో మొదటి అమెరికన్ నోబెల్ గ్రహీత గా పేరు పొందారు.

జీవిత చరిత్ర

[మార్చు]

మైకెల్సన్ పర్షియా దేశంలోని, పొసెన్ రాష్ట్రంలోని, స్త్ర్జెల్నోలోని ఒక యూదుల కుటుంబంలో జన్మించారు. 1855 లో తన రెండవ ఏటన తన తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వెళ్ళిపొయారు. అతని తండ్రి ఒక వ్యాపారి. అతడి చిన్నతనం కాలిఫోర్నియా, వర్జినియా, నెవాడా నగరాలలో గడిచింది. అతని కుటుంబం పుట్టుకతోనే యూదుల కుటుంబం కాని మత విరుద్ద కుటుంబం. అతని తండ్రి ఒక అలోచనకర్త. అతను మతవిరుద్ద కుటుంబంలో పెరగడం వలన అతనికి పూర్వ ఆచారాలపై నమ్మకం లేదు.