అల్సర్
స్వరూపం
కడుపులోని ఆమ్లం పరిమాణంలో మార్పులు వచ్చినప్పుడు తిన్నది జీర్ణం కాకపోవడం, కడుపులో మంట, గ్యాస్ ఏర్పడడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఆమ్ల పరిమాణం పెరిగినా, తగ్గినా పేగుల్లో ఇబ్బందులు మొదలై పుండ్లు తయారవుతాయి.
ఇతర కారణాలు
[మార్చు]- హెలికోబాక్టర్ పైలోరీ అనే బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా అల్సర్ల సమస్య తలెత్తుతుంది.
- కీళ్లనొప్పుల కోసం చాలాకాలంగా మందులు వాడే వారిలో అల్సర్ల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.
- మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి కూడా అల్సర్లను తీవ్రం చేస్తాయి. అందుకే ఒత్తిడి నుంచి బయటపడడానికి యోగా, ధ్యానం చేయడం అవసరం.
- మలబద్దకం అల్సర్లను అధికం చేస్తుంది. కాబట్టి పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మలవిసర్జనలో ఇబ్బందులు తగ్గుతాయి.
జాగ్రత్తలు
[మార్చు]- ఆహారాన్ని బాగా నమిలి తిన్నప్పుడు లాలాజలం బాగా ఉత్పన్నమవుతుంది. దీనికి ఆమ్లాన్ని తగ్గించే గుణం ఉంది. అందుకే ఆదరాబాదరాగా కాకుండా ఆహారాన్ని బాగా నమిలి తినడం మంచిది.
- అల్సర్ వల్ల కడుపులో మరీ నొప్పిగానో లేదా మంటగానో ఉన్నప్పుడు బాగా నీరు తాగాలి.
- అల్సర్ ఉన్నవాళ్లు ఏదీ అతిగా ఉండకూడదు. ఉప్పు, కారం, మసాలాలు, పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు.
- పొగ తాగడం వల్ల పేగుల్లో ఉండే మ్యూకస్ పొర పలుచబడి ఆమ్లం సులభంగా ప్రభావం చూపిస్తుంది. అందుకే ధూమపానానికి దూరంగా ఉండాలి. మద్యం, టీ, కాఫీలు కూడా బాగా తగ్గించాలి.
- కడుపులో మరీ మంటగా ఉన్నప్పుడు మజ్జిగ తీసుకోవచ్చు. అలాగే తేనె తీసుకోవడం ఉత్తమం.
- కొన్ని ఆహార పదార్థాలు అల్సర్లను అధికం చేస్తాయి. అలా పడనివేవో గుర్తించి వాటికి దూరంగా ఉండాలి.