అశోక సుందరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశోక సుందరి
ఇమాజినేషన్ దేవత
దేవనాగరిअशोकसुंदरी
సంస్కృత అనువాదంAśokasundarī
అనుబంధందేవి, త్రిపుర సుందరి కుమార్తె
భర్త / భార్యనహుషుడు
తల్లిదండ్రులుపార్వతి (తల్లి), శివుడు (తండ్రి)
తోబుట్టువులువినాయకుడు (తమ్ముడు), కుమారస్వామి (అన్న), జ్యోతి, మానస (సోదరిమణులు)
పిల్లలుయయాతి, 100మంది కుమార్తెలు
వాహనంకైలాస పర్వతం

అశోక సుందరి హిందు దేవత, పార్వతి పరమేశ్వరుల కుమార్తె. అందం, విలాసాలకోసం ఆశీర్వాదం ఇస్తుంది. పద్మ పురాణంలో ఈమె కథను ప్రస్తావించబడింది.[1] ఈ దేవతను ఎక్కువగా దక్షిణ భారతదేశంలో బాలా త్రిపురసుందరి రూపంలో పూజిస్తారు.

పద చరిత్ర[మార్చు]

తన ఒంటరితనం తగ్గించడం కోసం ఒక కుమార్తె కావాలని పార్వతి కోరుకున్నప్పుడు ఆశ నెరవేరి కల్పవృక్షం చెట్టు నుండి అశోకసుందరి సృష్టించబడింది. ఆమె పేరులోని పదాలు ఆమె సృష్టి నుండి ఉద్భవించాయి. అశోక అంటే పార్వతీదేవి శోకం, బాధను తగ్గించడం, సుందరి అంటే అందమైన అమ్మాయి.[2]

పురాణ చరిత్ర[మార్చు]

అశోక సుందరి జననం పద్మ పురాణంలో ప్రస్తావించబడింది. పార్వతి ఒకసారి శివుడిని ప్రపంచంలోని అత్యంత అందమైన తోటకి తీసుకెళ్లమని అభ్యర్థించింది. ఆమె కోరిక ప్రకారం, శివుడు ఆమెను నందనవనానికి తీసుకువెళ్ళాడు, అక్కడ పార్వతి కల్పవృక్షం అనే ఒక చెట్టును చూసింది, అది ఏ కోరికనైనను తీర్చగలదు. పార్వతి కుమారుడు కార్తికేయుడు పెరిగి కైలాసాన్ని విడిచిపెట్టినప్పటి నుండి, తల్లిగా పార్వతికి విపరీతమైన దుఃఖం, ఒంటరితనం ఏర్పడింది. ఆమె ఒంటరితనం నుండి బయటపడటానికి చెట్టు నుండి ఒక కుమార్తెను కోరింది. ఆమె కోరిక ప్రకారం అశోక సుందరి జన్మించింది. స్వర్గపు రాజు ఇంద్రుడితో సమానంగా ఉండే చంద్ర వంశానికి చెందిన నహుషుడిని వివాహం చేసుకుంటుందని పార్వతి వాగ్దానం చేసింది. ఒకసారి, అశోక సుందరి తన పనిమనిషితో కలిసి నందనవనంలో తిరుగుతున్నప్పుడు, హుండా అనే రాక్షసుడు (దెయ్యం) ఆమెను చూసి ప్రేమలో పడింది. రాక్షసుడిని చూసిన అశోక సుందరి నహుషుడిని వివాహం చేసుకొనే విషయాన్ని అతనికి తెలియజేసింది. హుండా మారువేషంలో వితంతువుగా వచ్చింది. మారువేషంలో ఉన్న రాక్షసుడితో తన రాజభవనానికి చేరుకున్న అశోక సుందరి, అతని మోసాన్ని తెలుసుకుని, నహుషుడి చేత చంపబడాలని శపించి, ఆమె తల్లిదండ్రుల నివాసమైన కైలాస పర్వతానికి వెళ్ళిపోయింది. హుండా శిశువు నహుషుడిని రాజభవనం నుండి అపహరిస్తాడు. అప్పుడు, అతన్ని హుండా సేవకుడు రక్షించి వశిష్ఠ మహర్షి సంరక్షణలో ఇస్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత నహుషుడు పెరుగి, హుండాను చంపడం తన విధి అని తెలుసుకుంటాడు. హుండా అశోక సుందరిని అపహరించి, నహుషుడిని చంపానని చెబుతాడు. కిన్నర దంపతులు అశోక సుందరిని ఓదార్చారు. ఆమెకు నహుషుడి శ్రేయస్సు గురించి తెలియజేసి, ఆమె యయాతి అనే శక్తివంతమైన కొడుకు, వందమంది అందమైన కుమార్తెలకు తల్లి అవుతుందని తెలిపింది. నహుషుడు హుండాతో పోరాడి, ఘోరమైన యుద్ధం తరువాత అతనిని ఓడించి, అతను వివాహం చేసుకోబోతున్న అశోక సుందరిని రక్షించాడు. కాలక్రమేణా, ఇంద్రుడు లేనప్పుడు నహుషుడు స్వర్గపు తాత్కాలిక ప్రతినిధిగా నియమించబడ్డాడు.[2][3][4]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Bibek Debroy, Dipavali Debroy (2002). The holy Puranas. p. 152. "Nakusha and Ashokasundari had a son named Yayati.”
  2. 2.0 2.1 Gaṅgā Rām Garg (1992). Encyclopaedia of the Hindu World Vol. 3. Concept Publishing Company. p. 712. ISBN 978-81-7022-376-4.
  3. Vettam Mani (1975). Puranic Encyclopaedia: a Comprehensive Dictionary with Special Reference to the Epic and Puranic Literature. Motilal Banarsidass Publishers. pp. 62, 515–6. ISBN 978-0-8426-0822-0.
  4. George M. Williams (27 March 2008). Handbook of Hindu Mythology. Oxford University Press. pp. 217–8, 230. ISBN 978-0-19-5332-61-2.