Jump to content

అశ్వతి పిళ్ళై

వికీపీడియా నుండి
అశ్వతి పిళ్ళై
వ్యక్తిగత సమాచారం
జన్మనామంఅశ్వతి వినోద్ పిళ్ళై
జననం (2000-07-14) 2000 జూలై 14 (వయసు 24)[1]
తకలే దెగ్గర గ్రామం, కన్యాకుమారి, తమిళనాడు, ఇండియా[2]
నివాసముస్టాకామ్, స్వీడన్[2]
ఎత్తు172 cm
బరువు63 kg
దేశంస్వీడన్
వాటంకుడి
వుమెన్స్ సింగిల్స్, డబుల్స్
అత్యున్నత స్థానం215 (WS 10 May 2018)
400 (WD 5 July 2018)
BWF profile

అశ్వతి వినోద్ పిళ్ళై (జననం:2000 జులై 14) స్వీడిష్ బాడ్మింటన్ క్రీడాకారిణి. ఈమె తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో పుట్టింది. తరువాత వీరి కుటుంబం స్వీడన్ దేశంలో స్థిరపడ్డారు. స్వీడన్ లో కోచ్ రియో విలియంటో, ఆండర్స్ క్రిస్టియన్స్సెన్ చేత శిక్షణ పొందినది. భారతదేశం సందర్శించిన ప్రతి సంవత్సరం, ప్రకాష్ పదుకోన్ అకాడమీ లో నెల పాటు శిక్షణ తీసుకునేది. [3][4] ఈమె ఐరోపా లో చాలా జాతీయ, అంతర్జాతీయ ఆటల పోటీలలో పాల్గొన్నారు. స్వీడన్ లోని యూత్ ఒలింపిక్ గేమ్స్ ఆడిన మొదటి భారతీయ క్రీడారకారిణి.[3] 2018 సమ్మర్ యూత్ ఒలింపిక్స్ లో బాడ్మింటన్ ఆటల పోటీలో స్వర్ణ పథకం సాధించింది.[1]

తొలినాళ్ళ, వ్యక్తిగత జీవితం

[మార్చు]

పిళ్ళై తల్లి గాయత్రి, తండ్రి వినోద్ పిళ్ళై. ఈమె తమిళనాడు లోని తకలే దెగ్గరలోని గ్రామంలో జన్మించారు. [4] నాలుగవ తరగతి వరకు బెంగళూరులోని నేషనల్ పబ్లిక్ స్కూల్ లో చదివారు. వారి తండ్రి బాడ్మింటన్ ఆడటం చూసి ఈ ఆట మీద ఆసక్తి పెంచుకున్నారు. [5] 2009 లో పిళ్ళై వాళ్ళ తండ్రి ఉద్యోగం వలన కుటుంబం అంతా స్వీడన్లో స్థిరబడ్డారు. స్వీడన్ లో ఇంటెర్నేషనెల్లా ఏంగ్లేస్కా స్కోలన్ లో చదువుకున్నారు. [6] 12వ తరగతిలో గణిత శాస్త్రం, జీవన శాస్త్రం చదివారు. [5] క్రీడాకారులలో కారోలిన్ మారిన్, నటులలో దీపికా పదుకోని ఇష్టపడుతారు. [5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Badminton Athlete Profile: PILLAI Ashwathi - Juegos Olímpicos de la Juventud de Buenos Aires 2018". Buenos Aires 2018. Archived from the original on 26 జనవరి 2019. Retrieved 26 January 2019.
  2. 2.0 2.1 "Despite tasting Swede success, Ashwathi's heart remains in India". The New Indian Express. Retrieved 27 January 2019.
  3. 3.0 3.1 "First Indian to play for Sweden in Youth Olympics". The News Minute. Retrieved 16 January 2019.
  4. 4.0 4.1 "Kerala girl Ashwathi Pillai shoulders Swedish badminton hopes". The New Indian Express. Retrieved 26 January 2019.
  5. 5.0 5.1 5.2 "Ashwathi Pillai: Playing in India in front of my people is one of my biggest goals - Times of India ►". The Times of India. Retrieved 16 January 2019.
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు